ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అధికారులకు విన్నవించడం జరిగింది

0
129

 

 

సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో కోసిగి మండల కేంద్రంలోనే సమీకృత బాలుర వసతి గృహం (ఇంటిగ్రేడ్ హాస్టల్) కోసిగిలోనే కొనసాగించాలని జిల్లా కలెక్టర్ సిరి గారికి ఏఐఎస్ఎఫ్ నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు సోమన్న జిల్లా ఉపాధ్యక్షుడు యస్.ఈరేష్ మాట్లాడుతూ దేశంలోని నిరక్షరాస్యత లో వెనకబడిన కోసిగి మండలానికి గత 60 సంవత్సరాల క్రితం గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు వలసలు నివారించి విద్యను అందించేందుకు ఎస్సీ,బీసీ వేరు వేరుగా రెండు హాస్టల్స్ అద్దె భవనంలో ఇద్దరు వార్డెన్ లతో వేల సంఖ్యలో విద్యార్థులకు విద్యను అందించేవారు సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ విద్యార్థుల సంఖ్య పెరగడంతో ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో సొంత భవనాలు నిర్మించాలని అప్పట్లో పోరాటం చేసి జైలు సైతం వెళ్ళడం జరిగింది అన్నారు. విద్యార్థి ఉద్యమాలు స్పందించి కోట్ల రూపాయలు వెచ్చించి అందమైన సమీకృత బాలుర వసతి గృహ భవనం నిర్మించి ఇద్దరు వార్డెన్ లతో కొన్ని సంవత్సరాలు విద్యార్థులకు విద్యాభ్యాసాన్ని కొనసాగించారు. 2012 సంవత్సరంలో ఎస్సీ,బీసీ హాస్టల్స్ రెండు కలిపి ఇంటిగ్రేడ్ హాస్టల్ గా ఏర్పాటు చేశారు.ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ,బీసీ హాస్టల్ ఒక్కొక్కటిగా గురుకుల పాఠశాలల పేరుతో హాస్టల్ మూసివేసే ప్రక్రియ పూనుకున్నారు అని కూటమి ప్రభుత్వాన్ని వారు విమర్శించారు. ఈ హాస్టల్లో చదివిన ఎంతోమంది విద్యార్థులు ఉన్నత స్థాయిలో నిలబెట్టిన ఇలాంటి హాస్టల్ వసతి గృహాన్ని పూర్తిగా ఎత్తివేసేందుకు ప్రజా ప్రతినిధులు, పూను కుంటున్నారని మండిపడ్డారు. వార్డెన్ అయితే ఏకంగా విద్యార్థులను హాస్టల్ నుండి వెళ్లగొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇంత జరుగుతున్నా ఉన్నత అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని వాపోయారు. ఇప్పటికైనా పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని ఇంటిగ్రేడ్ హాస్టల్ కోసిగిలోనే కొనసాగించేలా ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ అధికారులు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రజా ప్రతినిధుల ఇళ్ళను ముట్టడించి నిరాహార దీక్షలు చేపడుతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు సురేష్, మల్లికార్జున, నరేష్, వంశి,రవి,తదితరులు పాల్గొన్నారు

Search
Categories
Read More
Punjab
Punjab Revives Hockey Legacy: Mega Grassroots Sports Push
Promoting youth engagement through sports remains a vital pillar of Punjab’s state policy....
By Lokeshwari Panthadi 2026-06-30 05:56:40 0 155
Telangana
తెలంగాణ క్రికెట్ అసోసియేషన్(TCA) జనరల్ సెక్రటరీ గురువారెడ్డి ప్రెస్ మీట్ .|
సికింద్రాబాద్ :తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (TCA) జనరల్ సెక్రెటరీ గురువారెడ్డి సికింద్రాబాద్ తాజ్...
By Sidhu Maroju 2025-12-19 13:57:24 0 257
Andhra Pradesh
పుంగనూరు: పుంగునూరు పట్టణ పరిధిలో బాలాజీ కాలనీలో కొత్తూరు మురళిఆటోను ఢీకొన్న కారు
పుంగనూరు పట్టణ పరిధిలోని బాలాజీ కాలనీ వద్ద గురువారం రాత్రి కోడిగుడ్ల లోడుతో వస్తున్న లగేజీ ఆటోను...
By Kothuru Murali 2026-02-06 03:47:18 0 205
Andhra Pradesh
తాడేపల్లి లోనిYSR కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి విడుదల రజిని
19.12.2025 తాడేప‌ల్లి   - చంద్ర‌బాబు మార్క్ దోపిడీకి మెడిక‌ల్ కాలేజీల...
By Rajini Kumari 2025-12-20 14:16:57 0 252
Telangana
పర్యావరణ పరిరక్షణలో భాగంగా గణపతి మట్టి విగ్రహాల ఉచిత పంపిణీ కార్యక్రమం
వినాయక చవితి సందర్భంగా తేదీ 12/09/2026 రోజున కరీంనగర్ 48వ డివిజన్లో రైస్ మిల్లు వద్ద ఉదయం 9.30...
By Thalakokkula Sadanandam 2026-09-11 15:35:55 0 104
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com