Madanapalle: అంబేద్కర్ గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లలో ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం. వెల్లడించిన అన్నమయ్య జిల్లా కోఆర్డినేటర్ టి. పద్మజ.

0
111

మదనపల్లె: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (COEs)లో 2026–27 విద్యా సంవత్సరానికి ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అన్నమయ్య జిల్లా కోఆర్డినేటర్ టి. పద్మజ ఒక ప్రకటనలో తెలిపారు.

 

మేధావులైన విద్యార్థులకు నాణ్యమైన ఇంటర్మీడియట్ విద్యతో పాటు IIT-JEE, NEET వంటి పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ అందించనున్నట్లు పేర్కొన్నారు. ఈ విద్యార్థులకు ఉచిత విద్య, వసతి, భోజనం, పాఠ్యపుస్తకాలు, అధ్యయన సామగ్రి తదితర సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఈ విద్యాసంవత్సరంలో మదనపల్లె, గుంటూరు (రాజేంద్రనగర్), నెల్లూరు జిల్లాల్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లలో ప్రవేశాలు కల్పించనున్నట్లు వెల్లడించారు.

 

ప్రవేశాల్లో 75 శాతం సీట్లు ఎస్సీ విద్యార్థులకు, మిగిలిన 25 శాతం సీట్లు ఎస్టీ, బీసీ, ఓసీ విద్యార్థులకు కేటాయించినట్లు తెలిపారు. అర్హత కలిగిన విద్యార్థులు https://apbragcet.apcfss.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆసక్తి గల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మరియు ప్రధానోపాధ్యాయులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కోఆర్డినేటర్ టి. పద్మజ కోరారు

Search
Categories
Read More
Andhra Pradesh
Chandrababu Naidu: ఆ రోజు త్వరలోనే వస్తుంది: ఢిల్లీ ఏఐ సమ్మిట్ లో సీఎం చంద్రబాబు.
గూగుల్ రాకతో విశాఖ ఏఐ డేటా హబ్‌గా ఎదుగుతుందని వెల్లడి క్వాంటం కంప్యూటింగ్ పరికరాలు తయారు...
By Pagadala Venkateswar 2026-02-20 11:38:17 0 361
Andhra Pradesh
తిరువూరులో న్యాయవాదుల విధుల బహిష్కరణ
తిరువూరు న్యాయవాదుల విధుల బహిష్కరణ    అనంతపురం జిల్లాకు చెందిన న్యాయవాది కే...
By Rajini Kumari 2026-04-17 15:37:18 0 141
Andhra Pradesh
మదనపల్లె: పతనమైన టమాటా ధరలు – గిట్టుబాటు కాక రైతుల ఆవేదన.
మదనపల్లె మార్కెట్‌లో శుక్రవారం టమాటా ధరలు భారీగా పడిపోయాయి. రైతులు దాదాపు 70 మెట్రిక్ టన్నుల...
By Pagadala Venkateswar 2026-03-06 09:27:14 0 181
SURAKSHA
WB Police Improve Traffic Flow in Busy Cities
Managing dense urban traffic is a daily challenge that the West Bengal Police handles with...
By Kalaga Sailaja 2026-06-27 08:23:52 0 112
Telangana
బొల్లారం ఆయుధాల చోరీ కేసును చేదించాం: డీజీపీ సివి ఆనంద్.|
● నలుగురు నిందితుల అరెస్ట్.. ప్రమాదకర ఆయుధాలు, మ్యాగజైన్లు, బుల్లెట్లు, బైనాక్యులర్ స్వాధీనం ●...
By Sidhu Maroju 2026-09-11 13:51:05 0 115
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com