నీట్ పేపర్ లీకేజీపై PDSU ఆగ్రహం విద్యాశాఖ మంత్రి రాజీనామాకు, విద్యాసంస్థల బంద్‌కు డిమాండ్

0
277

🎤కుమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్ 

ఆసిఫాబాద్, జూలై 23: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ (NEET) పరీక్ష పేపర్ లీకేజీ అవకతవకలపై Progressive Democratic Students Union (PDSU) కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా PDSU జిల్లా ప్రధాన కార్యదర్శి జగజంపుల తిరుపతి మాట్లాడుతూ లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసిన నీట్ లీకేజీపై సుప్రీంకోర్టు జడ్జితో సమగ్ర విచారణ జరిపించి బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనలు చేస్తున్నా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం దారుణమన్నారు. పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ప్రధాని నరేంద్ర మోదీ తక్షణమే రాజీనామా చేయాలని, వరుస లీకేజీలకు కారణమైన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) సంస్థను తక్షణమే రద్దు చేయాలని కోరారు. దేశ రాజధానిలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులు, మేధావులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు లాంటిదని మండిపడ్డారు. విద్యార్థుల పక్షాన పోరాడుతున్న ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్‌ను అక్రమంగా అరెస్ట్ చేసి ఆసుపత్రికి తరలించడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ అవకతవకలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా జూనియర్, డిగ్రీ, ఇంజనీరింగ్ ఉన్నత విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ బంద్ కార్యక్రమానికి విద్యార్థుల తల్లిదండ్రులు, మేధావులు, ప్రజాస్వామ్యవాదులు, ప్రజలు పెద్ద ఎత్తున సహకరించి విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో PDSU జిల్లా ఉపాధ్యక్షులు Sk. అయ్యూబ్ ఖాన్, ఆసిఫాబాద్ మండల అధ్యక్ష కార్యదర్శులు సమీర్, తరుణ్, సంఘం నాయకులు శివ శంకర్, శ్రీకాంత్, రిజ్వాన్ బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
తెలుగు రాష్ట్రాల్లో ఈ నెలాఖరు వరకు విస్తారంగా భారీ వర్షాలు.
30వ తేదీ వరకు తేలికపాటి నుంచి మోస్తరు, భారీ వర్షాలు తెలంగాణలో 5 డిగ్రీల వరకు తగ్గనున్న...
By Pagadala Venkateswar 2026-06-24 04:30:35 0 99
Andhra Pradesh
పోలీసులపై హత్యాయత్నం కేసులో నిందితులకు ఐదేళ్లు జైలుశిక్ష
ములకలచెరువులో 2017లో పోలీసులపై హత్యాయత్నానికి పాల్పడిన ఐదుగురు నిందితులకు మదనపల్లె 7వ అదనపు...
By Pagadala Venkateswar 2026-01-23 11:17:59 0 211
Andhra Pradesh
జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించిన జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు.
బాపట్ల: జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించిన...
By Gadiyapudi Narendra 2026-01-19 14:51:05 0 265
Andhra Pradesh
శ్రీశైలం మల్లికార్జున ఉత్సవాలకు నారా లోకేష్ కు ఆహ్వానం
*శ్రీశైలం మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు మంత్రి నారా లోకేష్ కు ఆహ్వానం*   ఉండవల్లి:...
By Rajini Kumari 2026-02-07 11:54:47 0 192
Andhra Pradesh
పుంగనూరు పోలీస్ స్టేషన్‌లో అదనపు ఎస్పీ ఆకస్మిక తనిఖీలు
అన్నమయ్య జిల్లా, పుంగనూరు అర్బన్ పోలీస్ స్టేషన్‌లో జిల్లా అదనపు ఎస్పీ వెంకటాద్రి ఆదివారం...
By Kothuru Murali 2026-06-28 18:05:39 0 146
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com