మంత్రి వివేక్ వెంకట స్వామిని కలిసిన మాల మహానాడు జాతీయ అధ్యక్షులు తాళ్లపల్లి రవి.

0
1K

కుత్బుల్లాపూర్,:పేద వర్గాల పెన్నిధి అయిన కాకా బాటలో నడుస్తున్న వివేక్​కు మంత్రి పదవి రావడంపై రాష్ట్ర వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయని తాళ్లపల్లి రవి తెలిపారు. శుక్రవారం మాల మహానాడు జాతీయ అధ్యక్షులు తాళ్లపల్లి రవి, సమాజ సేవకుడు, తెలంగాణ రాష్ట్ర మాల మహానాడు సెక్రటరీ జనరల్ డాక్టర్ బోల్లమల్ల నర్సింగ్ రావులు ఇటీవల మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన మాల ముద్దు బిడ్డ గడ్డం వివేక్ ను కలిశారు. ఈ సందర్భంగా వివేక్ వెంకట స్వామిని గజమాలతో సత్కరించి సన్నానించారు. ఈ సందర్భంగా మాల మహానాడు జాతీయ అధ్యక్షులు తాళ్లపల్లి రవి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి వర్గంలో చోటు సంపాదించిన మాల జాతి ముద్దు బిడ్డ, తెలంగాణ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించి రాష్ట్ర ఏర్పాటు కోసం పదవి త్యాగం చేసిన త్యాగశిలీ అని కొనియాడారు. తండ్రి (కాకా) వెంకట స్వామి అడుగు జాడల్లో ప్రజా సేవలో ఎల్లప్పుడు ముందు ఉండే వివేక్ వెంకట స్వామి సేవలను గుర్తించి మంత్రిగా పదవీ బాద్యతలు అప్పగించిన రేవంత్ రెడ్డికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ మహిళా అధ్యక్షురాలు గాజుల పున్నమ్మ, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గైని గంగారం, ఎం.కాంతయ్య, సోషల్ మీడియా కన్వీనర్ పెరుమాళ్ళ ధనమ్మ, సామాజికవేత్త డా.రాజు వడాల భాస్కర్, రాష్ట్ర నాయకులు మాడుగుల శ్రీనివాస్, బొప్ప నగేష్, తాళ్లపల్లి విజయ్, నరేష్, సిహెచ్ దివ్య, గౌరీ, చైతన్య, సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఆంధ్రాలో ₹1200 కోట్లతో BDL క్షిపణి కర్మాగారం |
ఆంధ్రప్రదేశ్‌లో ప్రకాశం జిల్లాలో ₹1200 కోట్ల వ్యయంతో క్షిపణి తయారీ యూనిట్‌ను ఏర్పాటు...
By Bhuvaneswari Shanaga 2025-10-06 04:21:23 0 35
Sports
ఇండియా vs వెస్టిండీస్ మ్యాచ్‌లో రన్‌ల వర్షం? |
భారత్ vs వెస్టిండీస్ మధ్య జరుగనున్న రెండో టెస్ట్ మ్యాచ్‌కు బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్...
By Bhuvaneswari Shanaga 2025-10-08 06:21:44 0 33
Telangana
నేరాల నిర్మూలన, శాంతి భద్రతల పరిరక్షణ కొరకే కార్డెన్ అండ్ సెర్చ్ తనిఖీలు తూప్రాన్ డిఎస్పీ. జే.నరేందర్ గౌడ్
మెదక్ జిల్లా:    అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తప్పవు....
By Sidhu Maroju 2025-07-10 16:12:41 0 964
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com