డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్

0
1K

కంటోన్మెంట్ వార్డు 6, బాపూజి నగర్ సెంటర్ పాయింట్ అడ్డా వద్ద డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ ను ఎమ్మెల్యే శ్రీగణేష్ ప్రారంభించారు. బాపూజి నగర్ పరిసర ప్రాంతాల్లో నీటి కొరతను తీర్చడానికి 45 లక్షల రూపాయలతో 300 మిమి డిఐ మెయిన్ ఫీడర్ పైప్‌లైన్ ఏర్పాటు చేస్తున్నట్టు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కొత్త పైప్ లైన్ నిర్మాణం నెల రోజుల వ్యవధిలో పూర్తవుతుందని బాపూజి నగర్ పరిసర ప్రాంతాల్లోని ప్రజలకు ఈ పైప్ లైన్ ద్వారా నీటి సరఫరా పెరిగి వారి కష్టాలు తీరుతాయని ఎమ్మెల్యే అన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు కంటోన్మెంట్ బోర్డు మాజీ వైస్ ప్రెసిడెంట్ జంపన ప్రతాప్, కాంగ్రెస్ నాయకులు ముప్పిడి మధుకర్, బల్వంత్ రెడ్డి, మారుతి తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
సింగల్ విండో అధ్యక్షునిగా దానమయ్య
గూడూరు మండల సింగల్ విండో అధ్యక్షులుగా గూడూరు ప్రముఖ టిడిపి నేత స్వర్గీయ బి కరుణాకర్ రాజు తండ్రి...
By mahaboob basha 2025-06-29 11:39:15 0 1K
Technology
సార్వభౌమ ఏఐకు ICAI కంపెనీ డేటా సమర్పణ |
ఇండియా సార్వభౌమ ఏఐ మోడల్స్ అభివృద్ధికి కీలకంగా మారే విధంగా ICAI (ఇన్‌స్టిట్యూట్ ఆఫ్...
By Bhuvaneswari Shanaga 2025-10-13 09:58:46 0 34
Telangana
గ్రామీణ రహదారులు మరమ్మతుల కోసం ఎదురుచూపు |
తెలంగాణలో రెండు నెలల పాటు కొనసాగిన భారీ వర్షాల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా అనేక రహదారులు...
By Bhuvaneswari Shanaga 2025-10-01 07:39:02 0 33
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com