Madanapalle: మదనపల్లెలో "జలధార" అమలులో తీవ్ర లోపాలున్నాయని, FTL గుర్తింపు లేకుండా పనులు చేసి ప్రజాధనం వృథా చేస్తున్నారని బహుజన యువసేన EEకి వినతిపత్రమిచ్చింది.

0
113

జలధార" అమలులో లోపాలు.. ప్రజాధనం వృథా అవుతోందని బహుజన యువసేన ఆందోళన

 

ఇరిగేషన్ ఈఈకి వినతిపత్రం అందజేసిన రాష్ట్ర అధ్యక్షుడు పునీత్ కుమార్

 

మదనపల్లె, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న "జలధార" చెరువుల పునరుద్ధరణ పథకం క్షేత్రస్థాయిలో తీవ్ర లోపాలతో అమలవుతోందని బహుజన యువసేన (BYS) రాష్ట్ర అధ్యక్షుడు పునీత్ కుమార్ ఆరోపించారు.

 

ఈ మేరకు మదనపల్లె ఇరిగేషన్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ)కు బుధవారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెరువులు, కుంటలు, ఫీడర్ కాలువలు, సహజ నీటి ప్రవాహ మార్గాల్లో పెద్దఎత్తున అక్రమ ఆక్రమణలు కొనసాగుతున్నప్పటికీ, వాటిని తొలగించకుండా ఖాళీ ప్రదేశాల్లో మాత్రమే తవ్వకాలు చేపడుతున్నారని విమర్శించారు.

 

రెవెన్యూ, సర్వే, ఇరిగేషన్ శాఖల సమన్వయంతో సంయుక్త సర్వే నిర్వహించకుండా, ఎఫ్‌టీఎల్ (FTL) సరిహద్దులను గుర్తించకుండానే పనులు చేపట్టడం వల్ల చెరువుల నీటి నిల్వ సామర్థ్యం పెరగదని, ఫలితంగా కోట్లాది రూపాయల ప్రజాధనం వృథా అవుతోందని పేర్కొన్నారు. మదనపల్లె డివిజన్ పరిధిలోని అన్ని చెరువులు, కుంటలు, కాలువలపై రెవెన్యూ, సర్వే, ఇరిగేషన్ శాఖలు సంయుక్తంగా వెంటనే సర్వే నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
GST RTGS ప పట్టాదారు పాసుపుస్తకాలపై మంత్రులు అధికారులతో సమీక్ష సీఎం చంద్రబాబు
    *అమరావతి*   *జీఎస్డీపీ, ఆర్టీజీఎస్, పట్టాదారు పాస్ పుస్తకాలపై మంత్రులు,...
By Rajini Kumari 2026-01-12 13:11:43 0 296
Telangana
నిజామాబాద్
నగరంలోని మార్వాడి గల్లీలో మంచినీటి పైప్ లైన్ లీకేజీ కావడంతో కార్పొరేషన్ కమిషనర్ దిలీప్ కుమార్...
By Sadaq Sadaq 2026-05-21 13:00:06 0 132
SURAKSHA
Sentinel of Integrity: Dr. Arshinder Singh Chawla
Unyielding Integrity: How Dr. Arshinder Singh Chawla’s Visionary Leadership is Redefining...
By Kalaga Sailaja 2026-07-20 05:58:10 0 86
Andhra Pradesh
కనిగిరి మండలం,లింగారెడ్డిపల్లి గ్రామంలో VB-G RAM G పధకం దేశవ్యాప్త విస్తరణ
కనిగిరి మండలం,లింగారెడ్డిపల్లి గ్రామంలో VB-G RAM G పధకం దేశవ్యాప్త విస్తరణ ప్రారంభోత్సవంలో...
By Chennaiah Kati 2026-07-03 12:55:01 0 101
Andhra Pradesh
ఉర్దూ అకాడమీ 2026 క్యాలెండర్ను ఆవిష్కరించిన- చీరాల అధికార ప్రతినిధి మహేంద్ర నాథ్
చీరాల నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఉర్దూ అకాడమీ 2026 సంవత్సర క్యాలెండర్‌ను శుక్రవారం...
By Vadlamudi NagaVenkat 2026-04-10 13:12:23 0 192
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com