కోసిగి పట్టణంలోని విద్యార్థి సంఘాల నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది

0
127

సోనం వాంగ్ చుక్ కు సంఘీభావంగా కోసిగిలో ఏఐఎస్ఎఫ్ , ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టడం జరిగింది.ఈ సందర్భంగా ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు ఏం. రాజు, ఎస్ వీరేష్ మాట్లాడుతూ దేశంలో నీట్ పరీక్షలలో జరిగిన అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరవధిక దీక్ష చేపట్టిన ప్రముఖ పర్యావరణ వేత్త, రామ్ మెగసెసే అవార్డు గ్రహీత సోనం వాంగ్ చుక్ కు విద్యార్థి యువజన సంఘాలు సంఘీభావం ప్రకటించడం జరిగిందని, సోనం వాంగ్ చుక్ గత నెల ఆఖరి నుండి న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష చేపట్టారనీ సోనం వాంగ్ చుక్ ఆరోగ్యం క్షీణిస్తున్నప్పటికీ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేకపోవడం విచారకరం. అలాగే దీక్షను భగ్నం చేసి సోనమ్ ను అరెస్ట్ చెయ్యడం దుర్మార్గం అని వారు మండి పడ్డారు. మోడీ సర్కార్ పాలన కేవలం కార్పొరేట్లకు అనుకూలంగా సాగుతోందనీ , అత్యంత ప్రతిష్టాత్మకమైన నీట్ పరీక్ష పేపర్ లీకేజీ లక్షలాదిమంది విద్యార్థుల్లో నిరాశను నింపిందనీ వారు అన్నారు. పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని దేశవ్యాప్తంగా ఆందోళన జరుగుతున్నప్పటికీ ప్రధాని మోడీ పట్టించుకోకపోవడం క్షంతవ్యం కాదనీ వారు తెలిపారు. లడక్ ప్రాంతంలో తాగేందుకు మంచినీళ్లు లేని పరిస్థితుల్లో మంచు పర్వతాలను కరిగించి నీళ్లుగా మార్చారు. ఇండియా సరిహద్దుల్లో చొరబాట్లను వ్యతిరేకించి, పలు పర్యావరణహిత కార్యక్రమాలు నిర్వహించారు. ఆయన ఇప్పుడు దేశం కోసం, న్యాయం కోసం, విద్యార్థుల కోసం నిరవధిక దీక్ష చేస్తున్నారు. పాశవిక నరేంద్ర మోడీ ప్రభుత్వం సోనం వాంగ్ చుక్ ఆరోగ్యం క్షీణిస్తున్నప్పటికీ కర్కశంగా వ్యవహరించిందని, మోడీ ప్రభుత్వ దుర్మార్గ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం. సోనం వాంగ్ చుక్ కు ఏదైనా జరిగితే ప్రధాని మోడీనే బాధ్యత వహించాలని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు తాయన్న, ఏఐఎస్ఎఫ్ విద్యార్థులు మల్లిఖార్జున, రాజు, నరసింహ, జాను,నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
రెడ్ క్రాస్ సేవలకు గుర్తింపు.. ఏడుగురు కలెక్టర్లకు స్వర్ణ పతకాలు.
ఆంధ్రప్రదేశ్‌లోని ఏడుగురు జిల్లా కలెక్టర్లు ప్రతిష్ఠాత్మక గవర్నర్ స్వర్ణ పతకాలకు...
By Pagadala Venkateswar 2026-08-29 05:42:36 0 75
Andhra Pradesh
పార్లమెంటరీ కమిటీలకు శిక్షణ తరగతులు మంత్రి లోకేష్
పార్లమెంటరీ కమిటీలకు శిక్షణ తరగతుల కార్యక్రమంలో ప్రసంగించిన నారా లోకేష్    టీడీపీలో...
By Rajini Kumari 2026-01-27 11:35:19 0 212
Andhra Pradesh
పండగలో అల్లర్లు, గొడవలు చేస్తే కఠిన చర్యలు
పండగలో గొడవలు, అల్లర్లు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పట్టణ సీఐ కె.నారాయణరావు అన్నారు. బొబ్బిలి...
By Boiena Rajesh 2026-04-27 05:44:02 0 238
Telangana
తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్...
By Sidhu Maroju 2025-12-07 14:59:12 0 334
Andhra Pradesh
రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయంలో క్యాబినెట్ సమావేశంలో పాల్గొన్న మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి
ఈరోజు విజయవాడలో రాష్ట్ర సచివాలయంలో జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో పాల్గొన్న రాయచోటి ఎమ్మెల్యే...
By Benguluri Madhubabu 2026-01-28 07:35:56 0 298
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com