ప్రమాదవశాత్తు మృతి చెందిన విద్యార్థి సాత్విక్ కుటుంబాన్ని పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

0
233

రామగుండం: పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం లింగాపూర్ మోడల్ స్కూల్‌కు చెందిన విద్యార్థి సాత్విక్ ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మృతి చెందిన విషాద ఘటన పట్ల పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ  తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఎంపీ వంశీకృష్ణ గారు బాధిత కుటుంబాన్ని స్వయంగా పరామర్శించి, సాత్విక్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదారుస్తూ, ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ, "చిన్న వయసులోనే సాత్విక్ వంటి విద్యార్థిని కోల్పోవడం అత్యంత విషాదకరం. ఈ ఘటన ప్రతి ఒక్కరినీ కలచివేసింది. బాధిత కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ కష్టకాలంలో వారికి అండగా ఉంటాం. మృతుడి ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ఈ దుఃఖాన్ని భరించే శక్తిని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను" అని అన్నారు.ఈ పరామర్శ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
చింతూరులోనే వాహనాల ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహించాలి!
చింతూరు సబ్‌డివిజన్ పరిధిలో నిలిచిపోయిన వాహనాల ఫిట్‌నెస్ పరీక్షలను వెంటనే...
By Shyamala Yadagiri 2026-08-14 03:57:40 0 163
Telangana
గంజాయి నీయంత్రణ మాదక ద్రవ్యల నిర్ములనకై తనిఖీలు : Si ప్రశాంత్
మంచిర్యాల : గంజాయి,మాదక ద్రవ్యాల నియంత్రణ మరియు ప్రజల్లో అవగాహన పెంపు లక్ష్యంగా రామగుండం పోలీస్...
By Avunoori Mahesh 2026-05-21 11:36:16 0 185
SURAKSHA
Surendra Singh Yadav, IPS: Leading Chandigarh with Vision
The Journey Begins A Leader Dedicated to Public Safety "The strength of a police force is...
By Fathima Safa 2026-07-23 05:25:29 0 122
Andhra Pradesh
పెట్రోల్, డీజిల్ కొరతతో బంకుల మూసివేత.. అధికారులకు సీఎం చంద్ర‌బాబు కీలక ఆదేశాలు.
రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం చంద్రబాబు సమీక్ష ప్యానిక్ కొనుగోళ్లతో 50 శాతానికి పైగా...
By Pagadala Venkateswar 2026-04-27 06:21:33 0 116
Telangana
తెలంగాణలో పేదల ఇండ్లు బుల్డోజర్‌తో కూల్చివేస్తూ, కేరళ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తారా?
తెలంగాణను ముందు అభివృద్ధి చేసుకోండి.. కేరళ ఎప్పుడో అభివృద్ధి చెందింది,  తెలంగాణలో పేదల...
By Ponnala Srinivasrao 2026-04-04 01:24:37 0 288
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com