గంజాయి నీయంత్రణ మాదక ద్రవ్యల నిర్ములనకై తనిఖీలు : Si ప్రశాంత్

0
184

మంచిర్యాల : గంజాయి,మాదక ద్రవ్యాల నియంత్రణ మరియు ప్రజల్లో అవగాహన పెంపు లక్ష్యంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నార్కోటిక్ డాగ్ స్క్వాడ్,యాంటీ నార్కోటిక్స్ వింగ్, మంచిర్యాల సీసీసీ నస్పూర్ పోలీసుల సమన్వయంతో ఎస్సై ప్రశాంత్ ఆధ్వర్యంలో గురువారం ఉదయం సీసీసీ నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.ఈ తనిఖీలు సీసీసీ నస్పూర్ కార్నర్ ప్రాంతం,ఆటో స్టాండ్ పరిసరాలు,సమీప హోటళ్లు,పాన్ షాపులు మరియు ప్రజలు అధికంగా రాకపోకలు సాగించే ప్రాంతాల్లో చేపట్టారు. తనిఖీల సందర్భంగా ఆటో స్టాండ్ వద్ద ఉన్న వ్యక్తులు, ప్రయాణికుల సామాన్లు,హోటళ్ల పరిసరాలు,పాన్ షాపులు మరియు అనుమానాస్పద ప్రదేశాలను క్షుణ్ణంగా పరిశీలించారు.మాదక ద్రవ్యాల అక్రమ రవాణా,వినియోగం మరియు నిల్వలను అరికట్టేందుకు ప్రత్యేక దృష్టి సారించినట్లు ఎస్సై తెలిపారు. ప్రజలకు గంజాయి, మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పిస్తూ, అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాల గురించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజల సహకారం అవసరమని ఎస్సై పేర్కొన్నారు.

Search
Categories
Read More
Dadra &Nager Haveli, Daman &Diu
Industrial Development and Investment Growth in Telangana
Telangana made notable progress in industrial development and investment promotion during 2026....
By Fathima Safa 2026-06-22 07:13:30 0 191
Andhra Pradesh
ప్రైవేట్ వైద్యుల వైద్య నిర్లక్ష్యం పై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డి.ఎం.హెచ్. ఓ కార్యాలయం దగ్గర ధర్నా
చీరాల: చీరాల శంకర్ లాప్రోస్కోపీ అండ్ ఇన్ ఫెసిలిటీస్ హాస్పిటల్ లో డెలివరీ నిమిత్తం పండిలనేని సౌమ్య...
By Gadiyapudi Narendra 2026-01-28 12:00:36 0 287
Andhra Pradesh
గుంటూరు సిటీని సర్వనాశనం చేశారు
కేంద్ర మంత్రి పెమ్మసాని గుంటూరు సిటీని సర్వనాశనం చేశారని మాజీమంత్రి అంబటి రాంబాబు విమర్శించారు....
By John Baji 2025-12-30 12:25:46 0 205
SURAKSHA
Karnataka Police Green Drive Plants Thousands of Trees Every Year
 Karnataka Police contributes to environment through massive tree plantation drives....
By Kalaga Sailaja 2026-07-01 11:58:49 0 266
Andhra Pradesh
వాహనాల తనిఖీ చేసిన పట్టణ ఎస్ఐ విజయ్ కుమార్
బాపట్ల జిల్లా ఎస్పీ బి. ఉమా మహేశ్వరరావు ఆదేశాలమేరకు బాపట్ల పట్టణ సీఐ రాంబాబు ఆధ్వర్యంలో పట్టణ...
By Gadiyapudi Narendra 2026-02-09 19:29:00 0 238
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com