గూడెం జడ్పీహెచ్ఎస్లో విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేసిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

0
243

మంచిర్యాల జిల్లా :  దండేపల్లి మండలం గూడెం జడ్పీహెచ్ఎస్ హైస్కూల్‌లో విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కూల్ బ్యాగులను పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, అదనపు కలెక్టర్ చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఎంపీకి ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ, గత కొన్ని సంవత్సరాలుగా పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్ఫూర్తితో తమ తాత కాకా వెంకటస్వామి ఈ ట్రస్ట్‌ను స్థాపించారని గుర్తుచేశారు,

గూడెం జడ్పీహెచ్ఎస్‌లో విద్యార్థులు బెంచీలు లేక ఇబ్బందులు పడుతున్న విషయం తనను బాధించిందని, త్వరలోనే ఈ పాఠశాలకు అవసరమైన బెంచీలను అందజేస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చదువుకునే వాతావరణం కల్పించేందుకు కృషి చేస్తామని చెప్పారు. ప్రతి విద్యార్థి బాగా చదివి తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని ఆకాంక్షించారు.కార్యక్రమం అనంతరం ఎంపీ విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు,ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ, గూడెం జడ్పీహెచ్ఎస్‌లో స్కూల్ బ్యాగుల పంపిణీ కార్యక్రమానికి వస్తుండగా కొందరు కాంగ్రెస్ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేయడం బాధాకరమని అన్నారు,రాజకీయాల్లో విభేదాలు సహజమే అయినప్పటికీ, ప్రజల అభివృద్ధి విషయంలో అందరూ కలిసి పనిచేయాలని సూచించారు. గతంలో గూడెం ఆలయ అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో కూడా తనకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని గుర్తు చేశారు.

అయితే అలాంటి విషయాలను తాను పట్టించుకోనని, ప్రజల అభివృద్ధి కోసం అందరూ కలిసి పనిచేయడమే తన ఆకాంక్ష అని ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు.

Search
Categories
Read More
Telangana
మెడికవర్ ఆసుపత్రిలో ప్యాంక్రియాటిక్ క్లినిక్ ప్రారంభం.|
సికింద్రాబాద్ : తెలంగాణలో యుక్త వయసులో ఉన్నవారికి ఇటీవల ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ గణనీయంగా వృద్ధి...
By Sidhu Maroju 2025-11-14 11:20:45 0 249
Telangana
హైదరాబాద్‌లో హై అలర్ట్‌.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన
హైదరాబాద్‌: బొల్లారం, సికింద్రాబాద్‌, కొంపల్లి, బోయిన్పల్లి, సుచిత్ర,...
By VALLERU SIMHADRI 2026-09-04 07:32:36 0 210
Telangana
గణేష్ నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన.|
● లింగం చెరువు కట్ట మైసమ్మ వద్ద ఏర్పాట్ల పరిశీలన ● ప్రశాంతంగా, సురక్షితంగా నిమజ్జనం...
By Sidhu Maroju 2026-09-15 08:39:41 0 96
Andhra Pradesh
సి. టి. ఎం. వద్ద ఘోర ప్రమాదం.. బొలెరో బోల్తా పడి ఇద్దరు మృతి.
మదనపల్లె మండలం సి.టి.ఎం. కంకర ఫ్యాక్టరీ వద్ద గురువారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు...
By Pagadala Venkateswar 2026-04-09 14:52:21 0 141
Telangana
మేలు జాతి దూడల ప్రదర్శన
చిలుకూరు మండల పరిధిలోని ప్రాథమిక పశు వైద్య కేంద్రం నందు ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల...
By Nookapangu Manikanta 2026-05-08 09:46:28 0 149
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com