ఎల్లమ్మ కళ్యాణానికి పకడ్బందీ ఏర్పాట్లు.|

0
118

- భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని శాఖల సమన్వయం

- లక్షలాది మంది రాక నేపథ్యంలో భద్రత, పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి.

హైదరాబాద్, జూలై 18: ఈ నెల 21న జరగనున్న బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణం, 22న నిర్వహించే రథోత్సవాన్ని పురస్కరించుకుని అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు.

శుక్రవారం ఆలయ ప్రాంగణంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి ఏర్పాట్లను పరిశీలించారు.

అమ్మవారి దర్శనానికి లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు జరిగేలా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని, ఆలయ పరిసరాల్లో పరిశుభ్రత కోసం అదనపు పారిశుద్ధ్య సిబ్బందిని నియమించాలని అధికారులను ఆదేశించారు.

భక్తులు దర్శనం సమయంలో తోపులాటలకు గురికాకుండా భారీ బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు, తాగునీరు, వైద్య సదుపాయాలు, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ వంటి ఏర్పాట్లను ముందుగానే సిద్ధం చేయాలని సూచించారు.

ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బల్కంపేట ఎల్లమ్మ ఆలయాన్ని గణనీయంగా అభివృద్ధి చేసినట్లు తెలిపారు.

గతంలో అమ్మవారి కళ్యాణానికి సుమారు 20 వేల మంది భక్తులు హాజరయ్యేవారని, ప్రస్తుతం ఆ సంఖ్య 7 నుంచి 8 లక్షలకు చేరుకుందని చెప్పారు. వారానికి లక్ష మందికి పైగా భక్తులు ఆలయాన్ని సందర్శిస్తున్నారని పేర్కొన్నారు.

#Sidhumaroju

Search
Categories
Read More
Andhra Pradesh
కురబలకోటలో కారు ఢీకొని భవన కార్మికుడికి తీవ్ర గాయాలు.
కురబలకోట మండలంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భవన నిర్మాణ కార్మికుడు కె. రమణ (45) తీవ్రంగా...
By Pagadala Venkateswar 2026-05-18 04:16:25 0 184
Andhra Pradesh
రాష్ట్ర ఉపముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ 1 to 1 సమావేశాలు
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ Pawan Kalyan గారు ఈ రోజు పార్టీ ఎమ్మెల్యేలతో...
By Rajini Kumari 2025-12-19 11:01:06 0 246
Andhra Pradesh
అన్నమయ్య జిల్లాలో పదో తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం: డీఈవో.
అన్నమయ్య జిల్లాలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 16వ...
By Pagadala Venkateswar 2026-03-15 03:55:25 0 188
Andhra Pradesh
సామర్లకోటలో సహకార సంఘ ఉద్యోగుల నిరసన – డిమాండ్లు పరిష్కారం వరకు సమ్మె కొనసాగింపు
సామర్లకోట : రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న సహకార సంఘ ఉద్యోగుల సమ్మెలో భాగంగా సామర్లకోటలో కూడా...
By Ratna Sekhar 2026-02-19 19:31:08 0 1K
Telangana
TG : రిజర్వేషన్లు— హైకోర్టు కీలక వ్యాఖ్యలు
 హైదరాబాద్‌: బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ హైకోర్టు ఇవాళ(శనివారం, సెప్టెంబర్‌ 27)...
By Sidhu Maroju 2025-09-27 15:36:28 0 323
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com