చంద్రబాబు, నారాయణలపై సీఐడీ కేసు కొట్టేస్తూ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు!

0
90

 

 

 

చంద్రబాబుపై సీఐడీ కేసు కొట్టేసిన హైకోర్టు

రాజకీయ ప్రత్యర్థుల కేసులపై కోర్టు ఆగ్రహం

పాలసీ నిర్ణయాలకు నేరం ఆపాదించడం తప్పని వ్యాఖ్య

ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై తీవ్ర ఆక్షేపణ

ఫైనల్ తీర్పులో లార్డ్ డెన్నింగ్ సూత్రాలు

రాష్ట్రంలో పాలకులు మారినప్పుడల్లా పాత ప్రభుత్వాల విధానపరమైన నిర్ణయాలపై క్రిమినల్ కేసులు పెట్టే రాజకీయ సంస్కృతికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గట్టి బ్రేక్ వేసింది. అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి పి.నారాయణలపై గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నమోదైన సీఐడీ కేసును కొట్టేస్తూ న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసు కేవలం రాజకీయ ప్రతీకారంతో పెట్టిందే తప్ప, ఇందులో ఎలాంటి ప్రజాప్రయోజనం లేదని హైకోర్టు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వై.లక్ష్మణరావు స్పష్టం చేశారు.

 

చట్టాన్ని బలహీనులకు రక్షణ కవచంగా వాడాలి.. ఆయుధంగా కాదు!

ప్రముఖ అంతర్జాతీయ న్యాయకోవిదుడు లార్డ్ డెన్నింగ్ చెప్పిన ప్రసిద్ధ సూత్రాలను ఈ సందర్భంగా హైకోర్టు గుర్తుచేసింది. "చట్టం అనేది శక్తిమంతుల చేతిలో ప్రత్యర్థులను అణచివేసే ఆయుధంగా మారకూడదు.. అది కేవలం బలహీనులకు రక్షణ కవచంగా మాత్రమే ఉండాలి" అని వ్యాఖ్యానించింది. ప్రభుత్వాలు తమ తర్వాత వచ్చే ప్రభుత్వం కేసులతో వేధిస్తుందనే భయం లేకుండా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఉండాలని, లేనిపక్షంలో ప్రజాస్వామ్య పునాదులే కదిలిపోతాయని కోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

Search
Categories
Read More
Andhra Pradesh
మార్క్ టల్లి మరణం మీడియా లోకానికి తీరని లోటు
ప్రముఖ రచయిత జర్నలిస్టు మార్క్ టిల్లీ l భారతీయ అసలు సిసలు వ్యాఖ్యాత మార్క్ ఢిల్లీ కన్నుమూశారు...
By Benguluri Madhubabu 2026-01-26 07:08:17 0 287
Prop News
Redefining Real Estate with Transparency & Trust
Real estate is one of the most significant industries in the world, yet it remains complex,...
By Hazu MD. 2025-05-19 11:32:11 0 3K
Telangana
బండి భగీరథ బేల్ మంజూరు .....
ఫైనల్ ఎగ్జామ్స్.. బండి భగీరథ్కు బెయిల్ భారత్ అవాజ్ న్యూస్: 20 జూన్ రోజున TG: పోక్సో కేసులో...
By Gujile Ramu 2026-06-20 08:14:16 0 223
Andhra Pradesh
యువతి ఆత్మహత్య కేసు ఆరుగురు అరెస్ట్
యువతి ఆత్మహత్య కేసు – ఆరుగురు అరెస్ట్     విశాఖపట్నం , ఆరిలోవ :...
By Rajini Kumari 2026-04-18 17:20:59 0 151
SURAKSHA
Guardian of Justice: The Inspiring Odyssey of IPS B. K. Singh
Mastering the Line of Duty: Leadership, Grit, and Integrity: "Integrity is not a badge of honor...
By Kalaga Sailaja 2026-07-29 05:55:05 0 120
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com