యువతి ఆత్మహత్య కేసు ఆరుగురు అరెస్ట్

0
147

యువతి ఆత్మహత్య కేసు – ఆరుగురు అరెస్ట్

   

విశాఖపట్నం , ఆరిలోవ : విశాలాక్షినగర్‌లోని ఓ లాడ్జిలో ఆత్మహత్యకు పాల్పడిన అకుమర్తి శాంతికుమారి (28) కేసులో ఆరుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు ఏసీపీ నరసింహమూర్తి తెలిపారు. ఈ మేరకు ఆరిలోవ పోలీస్‌స్టేషన్‌లో 

 

గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ …. జోడుగుళ్లపాలేనికి చెందిన మృతురాలి తల్లి ఎ.రమ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. శాంతికుమారి ఆత్మహత్య చేసుకుందా లేదా హత్య జరిగిందా అన్న కోణంలో దర్యాప్తు చేపడుతున్నామని, పోస్టుమార్టం నివేదిక వచ్చాక పూర్తి వివరాలు వెలుగులోకి వస్తాయన్నారు. నిందితుల్లో పి.సాయికుమార్‌ (24), ఆర్‌.లక్ష్మి (20), జి.వి.సాయిజశ్వంత్‌ (23), వి.సాయికిరణ్‌ (24), పి.మణి (19), ఎన్‌.సాయి కుమార్‌ (25) ఉన్నారు. వీరిలో ఇద్దరు బీటెక్‌ చదివిన వారు కాగా.. ఒకరు హోటల్‌ మేనేజ్‌మెంట్‌ అభ్యసించారు. ఇంకొకరు మెకానిక్‌. నిందితులంతా ఖాళీగా ఉంటూ తిరుగుళ్లతో కాలక్షేపం చేస్తున్నారని, అందరూ విశాఖ నగరానికి చెందిన వారేనని తెలిపారు. సోషల్‌ మీడియా వేదికగా వీరంతా స్నేహితులైనట్లు చెప్పారు. క్రమశిక్షణ తప్పడం, తప్పటడుగుల వల్ల ఎదురయ్యే పరిణామాలపై అవగాహన లేకపోవడం, తల్లిదండ్రుల నిర్లక్ష్యం తదితర కారణాలతో వీరంతా బాధ్యతారహితంగా వ్యవహరించి ఒక నిండు ప్రాణం పోవడానికి కారణమయ్యారని, నిందితుల జీవితాలు కూడా దెబ్బతిని తల్లిదండ్రులకు దుఃఖం మిగిల్చారని ఏసీపీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో సీఐ మల్లేశ్వరరావు, ఎస్సైలు పాల్గొన్నారు. యువకులు లాడ్జిలో గదులు తీసుకున్న చోట తాము వచ్చిన సంగతి అందులో రికార్డు కాకూడదనే ఉద్దేశంతో అక్కడున్న సీసీ కెమెరాలు ఓ వైపు తిప్పేసినట్లు కూడా పోలీసులు గుర్తించారు. సీసీ కెమెరా దృశ్యాలే కీలకం: ఈ కేసులో సంబంధిత లాడ్జి కారిడార్‌లోని సీసీ కెమెరా దృశ్యాలు కీలకం కానున్నాయి. ఆ రోజు రాత్రి 9 గంటల ప్రాంతంలో నిందితులు తొలుత వాటి దిశ మార్చేశారు. తర్వాత హోటల్‌ సిబ్బంది యథాస్థితికి తెచ్చినా.. రాత్రి 11.30 గంటల ప్రాంతంలో మళ్లీ పక్కకు తిప్పేశారు. ఈ చర్యతో ముందస్తు ప్రణాళిక మేరకే వారు ఈ నేరానికి పాల్పడి ఉండొచ్చుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా..నిందితులు లాడ్జిలోని ఓ కెమెరా విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నా.. మరో చోట ఉన్న కెమెరాలో అంతా రికార్డు అయినట్లు తెలిసింది. ఆ దృశ్యాల్లో శాంతికుమారిపై వారంతా దాడి చేయడం, ఇతర కీలక ఆధారాలు పోలీసులకు లభించినట్లు సమాచారం.

Search
Categories
Read More
Telangana
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం లో పాల్గొన్న మంచిర్యాల ఎంమ్మెల్యే
మంచిర్యాల : ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలం పిప్రి గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజా పాలన- ప్రగతి...
By Avunoori Mahesh 2026-04-06 17:03:57 0 325
Telangana
బెల్లంపల్లి: కాంగ్రెస్ నాయకుడు పై కేసు నమోదు
బెల్లంపల్లి: కాంగ్రెస్ నాయకుడు పై కేసు నమోదు కాంగ్రెస్ పార్టీ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్...
By Pinnehasan Odela 2026-01-10 13:14:58 0 260
Andhra Pradesh
రోడ్ల అభివృద్ధికి మరో అడుగు… యర్రగొండపాలెంలో శుభారంభం! ఈ రోజు ఉదయం 10 గంటలకు యర్రగొండపాలెం పట్టణం, అయ్యప్ప స్వామి గుడి వద్ద ₹9 కోట్ల నిధులతో మంజూరైన యర్రగొండపాలెం – త్రిపురాంతకం తారు రోడ్డు కార్
రోడ్ల అభివృద్ధికి మరో అడుగు… యర్రగొండపాలెంలో శుభారంభం! ఈ రోజు ఉదయం 10 గంటలకు...
By Chennaiah Kati 2026-01-21 14:59:34 0 278
Ladakh
MHA Holds Preparatory Talks on Ladakh's Future
A high-level delegation from the Ministry of Home Affairs, including senior officials and...
By Lokeshwari Panthadi 2026-07-02 05:18:40 0 78
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com