ప్రయివేట్ స్కూల్స్ వద్దు-అంగన్వాడి కేంద్రాలే ముద్దు.

0
1K

 

చిన్నారుల చిరునవ్వులకు చిరునామాగా అంగన్వాడి కేంద్రాలు : అంగన్వాడీ టీచర్ వెంకటలక్ష్మి

కుత్బుల్లాపూర్ : ప్రయివేట్ స్కూల్ వద్దు అంగన్వాడి కేంద్రాలే ముద్దు అని, చిన్నారుల చిరునవ్వులకు చిరునామాగా అంగన్వాడి కేంద్రాలు నిలుస్తున్నాయని, ప్రయివేట్ స్కూళ్లకు పిల్లలను పండించడం వల్ల తల్లిదండ్రులపై ఆర్థిక భారం పడటమే తప్పా సక్రమమైన విద్య అందదని, చదువు, పోషకాహారంతో పాటు ఆరోగ్య సంరక్షణ అంగన్వాడీల ద్వారా అందిస్తున్నామని,బడి ఈడు పిల్లలను అంగన్వాడి బడిలో చేర్పించి భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాలని అంగన్వాడీ టీచర్ వెంకటలక్ష్మి అన్నారు. బుధవారం ఉదయం 9 గంటలకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బాచుపల్లి మండలం, బాచుపల్లి సెంటర్ 2, రాజీవ్ గాంధీ నగర్ కాలనీ రోడ్ నెంబర్ 1 అంగన్వాడి సెంటర్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి బడిగంట కార్యక్రమాన్ని అంగన్వాడీ టీచర్ వెంకటలక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ శారద సూపర్వైజర్ రేణుక ఆదేశాల మేరకు అంగన్వాడి సెంటర్ లో ఉన్నటువంటి పిల్లలందరికీ అలాగే గర్భిణీ స్త్రీలకు ప్రభుత్వ నుంచి వచ్చేటువంటి బాలామృత్, పాలు, గుడ్లు సమయానికి అందిస్తున్నామని తెలిపారు. పిల్లలకు చదువు ఆటపాటలతో పాటు ఆహారం ముఖ్యమని అన్నారు. అమ్మ ఒడి లాంటిదే అంగన్వాడీ బడి అని, పిల్లలు స్వేచ్చగా నేర్చుకనేందుకు రంగు రంగుల బొమ్మలు, కథల పుస్తకాలు, ఆట వస్తువులు, పిల్లల అభివృద్ధికి దోహదపడతాయని అన్నారు. ఆట పాటలతో కూడిన విద్యతో పాటు పిల్లల ఆరోగ్యం కొరకు ప్రతిరోజు పిల్లలకు ఉచితంగా ప్రొద్దున గుడ్డు మధ్యాహ్న భోజనం,సాయంత్రం స్నాక్స్ అందజేస్తామని అన్నారు. కార్పొరేట్ ప్రీస్కూల్లకు దీటుగా అంగన్వాడీలు పనిచేస్తున్నాయని, అన్నారు. మన దేశ భవిష్యత్తు చిన్నారుల చేతుల్లోనే ఉందని, అందుకే వారిని తీర్చిదిద్దాల్సిన బాధ్యత అంగన్వాడి సిబ్బందిపై ఉందన్నారు. అంగన్వాడీల బలోపేతం కోసం ప్రజా ప్రభుత్వం పని చేస్తుందని, అంగన్వాడీ లబ్ధిదారులకు మరిన్ని పోషకాలను అందిస్తామని వెల్లడించారు. బస్తి మహిళలు మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలకు బాలింతరాళ్లకు రాజీవ్ గాంధీ నగర్, బాచుపల్లి సెకండ్ సెంటర్ అంగన్వాడీ కేంద్రంలో పాలు, గుడ్లు తీసుకుంటున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ హెల్పర్ మౌనిక, స్థానిక మహిళలు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Like
1
Search
Categories
Read More
Telangana
తెలంగాణ అంగన్‌వాడీలకు భారీ నిధుల విడుదల |
తెలంగాణ రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాల అభివృద్ధికి ప్రభుత్వం భారీ నిధులు విడుదల చేసింది....
By Bhuvaneswari Shanaga 2025-10-17 09:48:49 0 24
Delhi - NCR
పట్టపగలే ఒత్తిడిలో ఒప్పందాలు కుదరవు: గోయల్ |
వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ఇటీవల ప్రకటించిన ప్రకటనలో, భారత్ ఎలాంటి ఒత్తిడిలోనూ...
By Deepika Doku 2025-10-25 07:20:11 0 17
Telangana
GHMC విడుదల చేసిన ఓటర్ల జాబితా |
హైదరాబాద్ జిల్లా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరగనున్న ఉప ఎన్నికకు సంబంధించి GHMC ఓటర్ల జాబితాను...
By Bhuvaneswari Shanaga 2025-10-01 07:28:11 0 34
Business EDGE
🌍 You Don’t Need To Be Big To Make A Big Impact
🌍 You Don’t Need To Be Big To Make A Big Impact Your Local Voice Can Create National...
By Business EDGE 2025-04-30 11:44:14 0 4K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com