మైనంపల్లి హనుమంతరావు అన్న సహకారంతో రోడ్డు పనులు ప్రారంభం

0
1K

ఈరోజు అనగా 11-06-2025, బుధవారం రోజున, మౌలాలి డివిజన్ లోని గ్రీన్ హిల్స్ కాలనీ లో రోడ్ పనులు మల్కాజ్గిరి మాజీ శాసనసభ్యులు మన ప్రియతమ నాయకులు గౌరవనీయులు శ్రీ మైనంపల్లి హనుమంత్ అన్న గారి సాకారంతో మంజూరు కాబడి పనులు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి గ్రీన్హిల్స్ కాలనీ అధ్యక్షుడు దశరథ్ రెడ్డి, హైడ్రా-RDO సుధా మేడం, వెంకటేశ్వర్లు సెక్రెటరీ,భాస్కర్ ట్రెజరర్,రమణయ్య వైస్ ప్రెసిడెంట్,శ్యామ్ రావు వైస్ ప్రెసిడెంట్,రామరాజు, ఎమ్మెస్ ఆర్ ప్రసాద్, సుబ్బారావు, అశోక్, విజయ్, గాంధీ రామలక్ష్మి సుష్మ విజయ్ గాంధీ,రామలక్ష్మి, మజారుద్దీన్, వాజిద్, జాఫర్, మజారోదీన్ మరియు ఇతర కాలనీవాసులు పాల్గొని కొన్ని సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నామని ఈరోజు హనుమంతన్న సహకారంతో పని ప్రారంభం అవుతుందని తమ సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ధన్యవాదాలు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమానికి 138 డివిజన్ ప్రెసిడెంట్ పోతుల వినోద్ యాదవ్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు వెంకన్న, చుంకు శ్రీను, హమీద్, నరసింగరావు, శివాజీ, సలీం, అజయ్,మల్లేష్, ప్రేమ్,కృష్ణ, మరియు ఇతర కాంగ్రెస్ నేతలు పాల్గొని పనుల గురించి వాటి మంజూరు మరియు ప్రారంభం గురించి మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా 138 డివిజన్ ప్రెసిడెంట్ పోతుల వినోద్ యాదవ్ గారు మాట్లాడుతూ హనుమంతన్న చొరవతో మరియు సహాయ సహకారాలతోనే పనులు అవుతున్నాయని గుర్తు చేస్తూ కాంగ్రెస్ పాలనలోని పథకాలు, సన్న బియ్యం, మైనార్టీ లకు కుట్టు మిషన్ల పంపిణీ, రేషన్ కార్డుల పంపిణీ మొదలగునై వివరిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని చెప్పుతూ గ్రీన్ హిల్స్ కాలనీ వాసులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని భరోసాని ఇచ్చాడు.

Search
Categories
Read More
BMA
Citizen Rights
Bharat Citizen Rights Council (BCRC) The Citizen Rights Council (CRC) stands as a dedicated...
By Citizen Rights Council 2025-05-19 10:16:52 0 3K
Andhra Pradesh
APCRDAపై ₹200 కోట్ల పన్ను డిమాండ్‌ కలకలం |
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (APCRDA)పై ఆదాయపు పన్ను శాఖ ₹200 కోట్ల పన్ను...
By Deepika Doku 2025-10-11 09:31:05 0 108
Andhra Pradesh
రాష్ట్ర ప్రభుత్వ మెడికల్ ఫీజు మాఫీ యోచన |
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో చేరే కొత్త విద్యార్థులకు ఫీజు...
By Bhuvaneswari Shanaga 2025-10-06 05:39:23 0 19
Telangana
8 ఏళ్ల పోరాటం ఫలితం: HYDRA చర్య |
హైదరాబాద్‌ పోచారంలో 1978లో 27 ఎకరాల్లో 400 ప్లాట్లతో నిర్మితమైన జీపీ లే అవుట్‌లో, ఓ...
By Akhil Midde 2025-10-25 04:26:32 0 36
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com