ప్రజా సమస్యల పరిష్కారంలో వేగం – ప్రతి ఫిర్యాదుకు న్యాయం జరిగేలా చర్యలు: జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్, ఐపీఎస్

0
114

ప్రజా సమస్యల పరిష్కారంలో వేగం – ప్రతి ఫిర్యాదుకు న్యాయం జరిగేలా చర్యలు: జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్, ఐపీఎస్

గుంటూరు జిల్లా ప్రజలకు పారదర్శకమైన, ప్రజలకు చేరువైన పోలీసింగ్‌ను అందించాలనే లక్ష్యంతో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ (PGRS) కార్యక్రమం ద్వారా ప్రజల ఫిర్యాదులకు వేగవంతమైన పరిష్కారం అందిస్తున్నామని జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్, ఐపీఎస్ తెలిపారు.

ఈరోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన PGRS కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గారు స్వయంగా ప్రజల నుంచి వచ్చిన వినతులు, 197 ఫిర్యాదులను స్వీకరించి ఒక్కో అంశాన్ని పరిశీలించారు. ప్రతి ఫిర్యాదును బాధ్యతాయుతంగా విచారించి, బాధితులకు న్యాయం జరిగేలా చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

కార్యక్రమంలో అందిన ఫిర్యాదులను వెంటనే ఆన్‌లైన్ ద్వారా సంబంధిత పోలీస్ స్టేషన్లకు పంపించి, నిర్దేశిత గడువులోగా విచారణ పూర్తి చేసి నివేదిక సమర్పించాలని సూచించారు. ఫిర్యాదు పరిష్కారమైన అనంతరం తప్పనిసరిగా ఫిర్యాదుదారునికి సమాచారం అందించి, వారి సంతృప్తిని నిర్ధారించుకోవాలని స్పష్టం చేశారు.

ఫిర్యాదుదారునికి సమాచారం ఇవ్వకుండా ఏ పిటిషన్‌ను కూడా ముగించకూడదని, సమస్యలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఎస్పీ గారు పేర్కొన్నారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా ప్రతి పోలీస్ అధికారి సేవాభావంతో విధులు నిర్వర్తించాలని సూచించారు.

ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయానికి వచ్చిన ప్రజలకు ఫిర్యాదుల నమోదు, దరఖాస్తుల స్వీకరణ తదితర ప్రక్రియల్లో పోలీస్ సిబ్బంది అవసరమైన సహకారం అందించారు.

అదేవిధంగా, అమ్మ చారిటబుల్ ట్రస్ట్, సాయినగర్, గుంటూరు ఆధ్వర్యంలో ప్రతి వారం నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ గారు అభినందించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు, వృద్ధులు, నిరుపేదలకు ఈ సేవ ఎంతో ఉపయోగపడుతోందని పేర్కొంటూ, సమాజ సేవలో భాగస్వామ్యమైన అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులను ప్రత్యేకంగా అభినందించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) శ్రీ జి.వి. రమణమూర్తి, మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, ట్రాఫిక్ డీఎస్పీ బెల్లం శ్రీనివాస్, PGRS సీఐ బిలాలుద్దీన్, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
అక్కడ మృతి చెందిన విద్యార్థిది పుంగనూరు మండలం
పుంగనూరు మండలం మంగళం గ్రామానికి చెందిన 22 ఏళ్ల భావన, రంగంపేటలోని ఓ కాలేజీలో బిటెక్ ఫైనల్ ఇయర్...
By Kothuru Murali 2026-02-25 09:42:01 1 237
SURAKSHA
Ashok Kumar, IPS: Leading Uttarakhand with Courage & Vision
A distinguished 1989-batch IPS officer of the Uttarakhand Cadre, renowned for modern policing,...
By Lokeshwari Panthadi 2026-07-29 10:00:55 0 220
Andhra Pradesh
నందవరం మండల అధ్యక్షుడు బిజెపి నాయకులు మఠం రాజశేఖర్ స్వామి
ఈరోజు నందవరం మండలం పులిచింత గ్రామానికి చెందిన నందవరం మండల అధ్యక్షుడు బిజెపి నాయకులు మఠం రాజశేఖర్...
By Boya Dasthagiri 2026-08-02 16:15:19 0 179
Andhra Pradesh
BR Naidu: హిందువుల ప్రాణాలు తీసేందుకే లడ్డూల్లో విష రసాయనాలు.. వైసీపీ మహాపాపం చేసింది: టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు.
BR Naidu: హిందువుల ప్రాణాలు తీసేందుకే లడ్డూల్లో విష రసాయనాలు.. వైసీపీ మహాపాపం చేసింది: టీటీడీ...
By Pagadala Venkateswar 2026-01-31 06:19:42 0 204
Telangana
యూసుఫ్ నగర్ స్మశానవాటిక అభివృద్ధి, ఉర్దూ మెడికల్ స్కూల్ ఏర్పాటుపై మంత్రిని కలిసిన ఎమ్మెల్యే మాధవరం
హైదరాబాద్, జూన్ 19: భారత్ ఆవాజ్ ప్రతినిధి,  అల్లాపూర్ డివిజన్ పరిధిలోని యూసుఫ్ నగర్ ముస్లిం...
By Jagadeesh Babu 2026-06-19 15:14:34 0 273
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com