యూసుఫ్ నగర్ స్మశానవాటిక అభివృద్ధి, ఉర్దూ మెడికల్ స్కూల్ ఏర్పాటుపై మంత్రిని కలిసిన ఎమ్మెల్యే మాధవరం

0
272

హైదరాబాద్, జూన్ 19: భారత్ ఆవాజ్ ప్రతినిధి, 

అల్లాపూర్ డివిజన్ పరిధిలోని యూసుఫ్ నగర్ ముస్లిం స్మశానవాటిక అభివృద్ధి, నిర్వహణతో పాటు సర్వే నెం.18లో ఉర్దూ మెడికల్ స్కూల్ ఏర్పాటు అంశాలపై కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మొహమ్మద్ అజారుద్దీన్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా మేడ్చల్ జిల్లా మైనార్టీ అధ్యక్షుడు మహమ్మద్ గౌసుద్దీన్, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు ముస్లిం సంఘాల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.

మంత్రి అజారుద్దీన్‌కు వినతిపత్రం అందజేసిన అనంతరం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ, యూసుఫ్ నగర్‌లోని ముస్లిం స్మశానవాటికను అల్లాపూర్ డివిజన్ ప్రజలకే కేటాయించాలని, అక్కడ సరైన మౌలిక సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లు కల్పించాలని కోరారు. అదేవిధంగా సర్వే నెం.18లో ఉర్దూ మెడికల్ స్కూల్‌ను ఏర్పాటు చేసి మైనారిటీ వర్గాలకు వైద్య, విద్యా రంగాల్లో మెరుగైన అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

వినతిపై సానుకూలంగా స్పందించిన మంత్రి మొహమ్మద్ అజారుద్దీన్, సమస్యలను సమగ్రంగా పరిశీలించి త్వరలోనే అవసరమైన చర్యలు తీసుకునేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

ఈ సమావేశం ద్వారా అల్లాపూర్, యూసుఫ్ నగర్ ప్రాంతాల అభివృద్ధికి కొత్త అవకాశాలు ఏర్పడతాయని స్థానిక ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Search
Categories
Read More
SURAKSHA
Neerabh Kumar Prasad, IAS: Champion of Good Governance
A Leader Who Believes Development Begins with Empowering People "Inclusive growth is meaningful...
By Lokeshwari Panthadi 2026-07-13 13:18:18 0 131
Andhra Pradesh
ఏపీలో విస్తరిస్తున్న నైరుతి.. పలు జిల్లాలకు భారీ వర్ష సూచన.
    ఏపీలో విస్తరిస్తున్న నైరుతి.. పలు జిల్లాలకు భారీ వర్ష సూచన 12-06-2026 Fri ...
By Pagadala Venkateswar 2026-06-12 04:57:10 0 114
Andhra Pradesh
దేవాలయాలపై దాడులు చేసిన అంతర్రాష్ట్ర ముఠా అరెస్టు.
మంగళవారం, మదనపల్లిలో దేవాలయాలను లక్ష్యంగా చేసుకుని చోరీలు చేస్తున్న మహారాష్ట్ర అంతర్రాష్ట్ర...
By Pagadala Venkateswar 2026-05-06 06:51:17 0 128
Andhra Pradesh
ఉపాధి హామీ పనులు ప్రారంభించాలి
గ్రామాలలో ఉపాధి హామీ పనులను ప్రారంభించాలని ఎంపీడీవో పి.రవికుమార్ కోరారు. బొబ్బిలి మండలం పిరిడిలో...
By Boiena Rajesh 2026-04-01 23:51:49 0 236
Telangana
నార్త్ జోన్ డిసిపి రష్మీ పెరుమాళ్ ప్రెస్ మీట్.|
సికింద్రాబాద్ : ఉత్తర మండల పరిధిలోని కార్ఖానా, బొల్లారం పోలీస్ స్టేషన్ లలో ఇళ్లలో దొంగతనాలకు...
By Sidhu Maroju 2025-12-16 10:54:14 0 286
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com