మొహరం పండుగ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే

0
1K

మొహరం పండుగ ఏర్పాట్లపై డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం ఆరవ అంతస్తు సమావేశ హాల్లో రవాణా శాఖ మరియు హైదరాబాద్ ఇన్చార్జి పొన్నం ప్రభాకర్ గారి అధ్యక్షతన, జిహెచ్ఎంసి కమిషనర్ ,పోలీస్ ఉన్నతాధికారులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించిన కార్యక్రమంలో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి  పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ మొహరం పండుగను మౌలాలిలోని 12 ఆశుర్ ఖాన లు వాటికి గతంలో ఒక రూపాయి కూడా కేటాయించి అభివృద్ధి ఏర్పాట్లకు నోచుకోలేదు వాటిని దృష్టిలో పెట్టుకొని అక్కడకు కావలసిన తగిన ఏర్పాట్లు చేయాలని, రోడ్ల అభివృద్ధి, బ్యూటిఫికేషన్, విద్యుత్ దీపాలు, శానిటేషన్ డ్రింకింగ్ వాటర్, మొబైల్ ట్రాన్స్ఫార్మర్, మొబైల్ టాయిలెట్స్, ట్రాఫిక్ క్లియరెన్స్, వంటి సదుపాయవంటి కల్పించాలని మౌలాలి ప్రాంతం పెద్ద ముస్లిం కమ్యూనిటీ తోటి ఏర్పడిన ప్రాంతం మౌలాలి దర్గాకు ఆలమును తీసుకొని వస్తారని వివిధ ప్రాంతాల నుంచి వస్తారని తెలిపారు అదేవిధంగా 135 డివిజన్ వెంకటాపురంలో బోరా కమ్యూనిటీ వారు ప్రత్యేకంగా రోజుకు 15000 మంది ప్రార్థనలో పాల్గొంటారని అందులో 11 వేల మంది చెన్నై నుండి అతిధులు వస్తారని స్థానికంగా నాలుగు వేల మంది బోర కమ్యూనిటీ వారు మొహరం ప్రార్థనలో పాల్గొంటారని ఈ కార్యక్రమాలు జూన్ 26 నుండి జూలై ఏడో తారీఖు వరకు జరుగుతాయని అప్పటివరకు ప్రభుత్వం తరఫున కనీస వసతులు కల్పించాలని ఈవెంట్ పర్మిషన్లు ఇవ్వాలని , వీటికి సంబంధించి వక్స్ బోర్డ్ నుండి గాని మైనార్టీ డెవలప్మెంట్ నుంచి గాని ఒక కోఆర్డినేటర్ను నియమించాలని కోరారు అందుకు అధికారులు సానుకూలంగా స్పందించారు. ఈ యొక్క కార్యక్రమంలో మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉన్నత అధికారులు పోలీసు ఉన్నతాధికారులు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు

Search
Categories
Read More
Rajasthan
PM Modi to Visit Banswara on Sept 25 |
Prime Minister Narendra Modi is scheduled to visit Banswara, Rajasthan, on 25 September, where he...
By Bhuvaneswari Shanaga 2025-09-19 11:43:17 0 65
Telangana
అల్వాల్ పోలీస్ స్టేషన్ లో జెండా ఆవిష్కరణ
అల్వాల్ పీఎస్ లో ఎస్ హెచ్ ఓ రాహుల్ దేవ్ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన.. అందరికీ తెలంగాణ...
By Sidhu Maroju 2025-06-02 16:47:24 0 1K
Telangana
ఘనంగా సౌందర్యలహరి లలిత పారాయణ వరలక్ష్మి వ్రత పూజ
     హైదరాబాద్/బాకారం.        బాకారం ముషీరాబాద్ లోని తన...
By Sidhu Maroju 2025-08-02 14:26:08 0 678
Telangana
తెలంగాణ, భాతుకమ్మ వరల్డ్ రికార్డు ప్రయత్నం |
తెలంగాణ రాష్ట్రం భాతుకమ్మ పండుగలో మరో గొప్ప రికార్డును స్థాపించడానికి సిద్ధమవుతోంది. 28...
By Bhuvaneswari Shanaga 2025-09-23 05:15:11 0 85
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com