హెచ్‌ఎండీఏ కమిషనర్‌కు వినతులు.|

0
145

'మాస్టర్ ప్లాన్ రహదారులపై ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ప్రతిపాదనలు"

మేడ్చల్ మల్కాజిగిరి :మల్కాజ్‌గిరి నియోజకవర్గానికి సంబంధించిన పలు అభివృద్ధి అంశాలపై ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి బేగంపేట్‌లోని మెట్రో రైల్ భవనంలో హెచ్‌ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్‌ను కలిసి వినతిపత్రాలు సమర్పించారు.

కౌకూర్, మీర్జల్‌గూడ, ఏఎస్‌రావు నగర్ పరిసర ప్రాంతాల్లో హెచ్‌ఎండీఏ మాస్టర్ ప్లాన్‌లో ప్రతిపాదించిన రహదారుల కారణంగా స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు.

కౌకూర్‌లో శ్యామల లక్ష్మీనగర్, డాక్టర్స్ కాలనీ, విలాస్ స్ప్రింగ్ కాలనీలపై ప్రభావం చూపుతున్న 60 మీటర్ల ప్రతిపాదిత రహదారిని తొలగించాలని, మీర్జల్‌గూడ–చిన్మయ మార్గ్‌లో ప్రతిపాదించిన 60 అడుగుల రహదారిని 30 అడుగులకు కుదించాలని కోరారు. 

అలాగే ఏఎస్‌రావు నగర్ నుంచి నేరేడ్మెట్ వరకు ప్రతిపాదించిన 100 అడుగుల రహదారిని మాస్టర్ ప్లాన్ నుంచి తొలగించాలని కోరారు. ఈ ప్రతిపాదనల వల్ల స్థానిక ప్రజలు, ఆస్తి యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు.

ఇదే సందర్భంగా మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో సీఆర్‌ఎంపీ రోడ్ల నిర్మాణ, అభివృద్ధి పనులను వేగవంతం చేసి, అవసరమైన నిధులు మంజూరు చేయాలని ప్రత్యేక వినతిపత్రం సమర్పించారు.

వినతిపత్రాలపై హెచ్‌ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ సానుకూలంగా స్పందిస్తూ, సంబంధిత అంశాలను సమగ్రంగా పరిశీలించి ప్రజలకు అనుకూలంగా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

#Sidhumaroju

Alwal

Search
Categories
Read More
SURAKSHA
Biju George Joseph: Strengthening Law and Order
A distinguished 1995-batch Rajasthan Cadre IPS officer, Biju George Joseph has earned widespread...
By Lokeshwari Panthadi 2026-07-23 10:40:21 0 261
Telangana
నేడే పదవ తరగతి ఫలితాలు
న్యూస్ (భారత్ ఆవాజ్ ) నేడే పదవ తరగతి ఫలితాలు మధ్యానం 2 గంటలకు విడుదల ప్రకటించిన బోర్డు 
By Midathapalli Kiran Kumar 2026-04-29 07:06:29 0 626
Andhra Pradesh
ఈరోజు ఒంగోలులో నిర్వహించిన ప్రకాశం జిల్లా కూటమి ప్రభుత్వ “నమ్మకం – అభివృద్ధి, సంక్షేమo విజయోత్సవ సభ
ఈరోజు ఒంగోలులో నిర్వహించిన ప్రకాశం జిల్లా కూటమి ప్రభుత్వ “నమ్మకం – అభివృద్ధి,...
By Chennaiah Kati 2026-06-18 11:54:11 0 103
Andhra Pradesh
Ambati Rambabu: ఏపీ హైకోర్టులో 7 క్వాష్ పిటిషన్లు దాఖలు చేసిన అంబటి రాంబాబు.
Andhra Ambati Rambabu Files 7 Quash Petitions in AP High Court చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు...
By Pagadala Venkateswar 2026-02-06 13:21:00 0 182
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గం:చౌడేపల్లి 44వ అవిర్భావ దినోత్సవం – టీడీపీ శుభాకాంక్షలు
చౌడేపల్లి 44వ అవిర్భావ దినోత్సవం సందర్భంగా, మండల అధ్యక్షుడు గువ్వల రమేష్ రెడ్డికి గౌరవపూర్వక...
By Kothuru Murali 2026-03-31 04:10:12 0 203
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com