రాజంపేటలో రోడ్డుపైనే వంటలు అధికారులకు కనిపించడం లేదా?

0
166

🚨 రాజంపేటలో రోడ్డుపైనే వంటలు... అధికారులకు కనిపించడం లేదా? 🚨

 

మునిసిపాలిటీ అధికారులకు సంబంధిత అధికారులకు ఇది కనిపించలేదా??

 

వీరికి ఏమైనా ప్రత్యేక చట్టం ఉందా లేక ఇంకేమైనా ముడుతున్నాయా అని వాపోతున్న స్థానికులు..

 

🔥 "మమ్మల్ని అడిగేది ఎవరు?" అన్నట్లుగా వ్యవహరిస్తున్న హోటల్ యజమానులపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

📍 కడప జిల్లా రాజంపేట పాత బస్టాండ్‌లోని చిట్వేల్ రోడ్డుపై కొన్ని హోటల్ యజమానులు బహిరంగంగా రోడ్డుపైనే వంటలు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

 

💨 వంటల నుంచి వచ్చే పొగ, మంటల కారణంగా చిట్వేల్, నెల్లూరు వైపు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు చెబుతున్నారు. పొగతో కళ్లు మండిపోతూ, ఇబ్బందులు పడుతూ ప్రయాణించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 

❓ ఆటోలు, ఇతర వాహనాలు రోడ్డుపై ఆగితే వెంటనే చర్యలు తీసుకునే అధికారులు... రోడ్డుపైనే జరుగుతున్న ఈ వంటలను ఎందుకు పట్టించుకోవడం లేదు? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

 

⚠️ ప్రజల ప్రాణాల కంటే నిబంధనలు ముఖ్యమా? లేక కొందరి ఇష్టారాజ్యమే చట్టమా?

 

👉 సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రోడ్డుపై జరుగుతున్న వంటలను నిలిపివేసి, ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Search
Categories
Read More
Telangana
నిజామాబాద్
నిజామాబాద్ ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.|ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు – జాతీయ...
By Sadaq Sadaq 2026-08-15 08:24:22 0 122
Telangana
మంత్రి వివేక్ వెంకట స్వామిని కలిసిన మాల మహానాడు జాతీయ అధ్యక్షులు తాళ్లపల్లి రవి.
కుత్బుల్లాపూర్,:పేద వర్గాల పెన్నిధి అయిన కాకా బాటలో నడుస్తున్న వివేక్​కు మంత్రి పదవి రావడంపై...
By Sidhu Maroju 2025-06-13 14:25:20 0 1K
Telangana
నిజామాబాద్
BRS పార్టీ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం BRS పార్టీ సభ్యత్వ నమోదు మరియు SIR పై విస్తృత స్థాయి...
By Sadaq Sadaq 2026-06-09 09:07:03 0 157
Telangana
నిజామాబాద్. Mp అరవింద్ తో జైత్య పర్యాట న
ఎంపీ అరవింద్ తో  జగిత్యాల్ ప్రయాణంలో పలుగొన్న  జ్యోతి మురళీకృష్ణ9 వ డివిజన్...
By Sadaq Sadaq 2026-03-05 17:45:54 0 210
Andhra Pradesh
ఏపీలో 61 రోజుల చేపల వేట నిషేధం.. ఏప్రిల్ 15 నుంచి అమలు.
ఏపీలో సముద్రంలో చేపల వేటపై నిషేధం అమల్లోకి రానుంది. ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు మొత్తం 61 రోజుల...
By Pagadala Venkateswar 2026-04-11 06:55:59 0 152
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com