జేఏసీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తాలూకా సిఐ నల్లన్న సార్ గారికి వినతి

0
166

 టిడిపి మండల అధ్యక్షుడు దొడ్డనగిరి శివప్ప పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో తాలూకా సిఐ నల్లప్ప గారికి కంప్లైంట్ చేయడం జరిగింది ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు AISF జిల్లా ప్రధాన కార్యదర్శి షాబీర్ భాష డి.ఎస్.ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఉదయ్ పిడిఎస్ఓ రాష్ట్ర నాయకులు తిరుమలేష్ , బాలు మాట్లాడుతూ...* కర్నూలు జిల్లా ఆదోని మండలం దొడ్డనకేరి గ్రామంలో పాఠశాల స్థలాన్ని కబ్జాజేసి బెదిరింపులకు పాల్పడిన మాజీ సర్పంచ్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయవలసిందిగా కోరుతున్నాము.

 దొడ్డనకేరి జడ్.పి.హెచ్. హైస్కూల్ పూర్వ విద్యార్థులు మరియు విద్యార్థి సంఘాలనాయకులుగా దొడ్డనకేరి జడ్.పి.హెచ్. హైస్కూల్ మైదానంలో సుమారు 11సెంట్ల ప్రభుత్వ స్థలం కబ్జాకు గురైందని తెలిసి, పాఠశాల పరిరక్షణ బాధ్యతతో అక్కడికి వెళ్లి సంబంధిత వివరాలు తెలుసుకున్నాము.గ్రామంలో విద్యార్థులతో కలిసి నిరసన తెలియజేశాము. అనంతరం మా వద్ద ఉన్న ఆధారాలతో 06/07/2026 తేదీ న ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో గ్రీవెన్స్ ద్వారా అధికారికంగా ఫిర్యాదు సమర్పించాము.ఈ విషయంపై మాజీ సర్పంచ్ శివప్ప గారు ప్రెస్ మీట్ నిర్వహించి, పాఠశాల స్థలాన్ని కాపాడేందుకు ధర్నాలు, ర్యాలీలు చేస్తే కొడకల్లారా కాళ్లు చేతులు నరుకుతా అంటు బహిరంగంగా మీడియా ఎదుట మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా, మా పాఠశాల పూర్వ విద్యార్థుల ఇండ్లకు వెళ్లి వారిని భయభ్రాంతులకు గురిచేస్తూ బెదిరింపులకు పాల్పడటం జరిగింది. ఈ చర్యల వల్ల మాలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.ప్రభుత్వ పాఠశాల ఆస్తిని పరిరక్షించాలనే ఉద్దేశంతో చట్టబద్ధంగా అధికారులను ఆశ్రయించిన మాపై ఈ విధంగా బెదిరింపులు చేయడం చట్టవిరుద్ధమైన చర్య.మాకుటుంబాలు అన్ని తీవ్ర ఆందోళనకు చెందుతున్నాయి. అందువల్ల ఈ సంఘటనపై మీరు దీని పై స్పందించి మాజీ సర్పంచ్ శివప్ప గారిపై క్రిమినల్ కేసు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జేఏసీ విద్యార్థి సంఘాల నాయకులు తెలియజేశారు. అనంతరం ఈ కార్యక్రమంలో విద్యార్థి జేఏసీ నాయకులు శేఖర్ మోహన్ హరి రఘు వెంకటేష్ తదితరులు పాల్గొనడం జరిగింది

Search
Categories
Read More
Telangana
మనూర్:- గుడిలోకి మొదటిసారి దళితులు
సంగారెడ్డి జిల్లా మనూర్ మండలం కమలాపుర్ గ్రామంలో మొదటి సారి వారి అడుగులు గుడి లోపల పెట్టడంతో...
By Gandla Vaijanath 2026-08-20 07:19:14 0 112
BMA
Drought Defeated: Reporting on Indigenous Water Tech
Instead of exclusively highlighting drought tragedies, Solutions Journalism focuses on how...
By JoinBMA 2026-08-22 04:12:47 0 202
Andhra Pradesh
Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లెలో లీ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ రహిత సమాజం కోసం భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు.
మదనపల్లె, జూలై 26: ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు...
By Pagadala Venkateswar 2026-07-27 13:30:23 0 89
Andhra Pradesh
మదనపల్లిలో భర్తపై ఇనుపరాడ్ తో భార్య దాడి.
శుక్రవారం మదనపల్లెలో కుటుంబ కలహం తీవ్రరూపం దాల్చింది. శ్రీవారి నగర్‌కు చెందిన రెడ్డి బాబు...
By Pagadala Venkateswar 2026-04-10 06:24:00 0 137
Andhra Pradesh
గాలిబ్ షాహిద్ దర్గా భూములు కాపాడండి
*ఖిల్లా హజరత్ గాలిబ్ షహీద్ దర్గా భూములు కాపాడండి*   *అల్తాఫ్ బాబాకు దర్గా ముజావర్ల వినతి...
By Rajini Kumari 2026-03-28 14:12:21 0 261
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com