Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లెలో లీ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ రహిత సమాజం కోసం భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు.

0
88

మదనపల్లె, జూలై 26: ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు లీ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో, మాస్టర్ మురళి నేతృత్వంలో ఆదివారం ప్రత్యేక అవగాహన ర్యాలీ నిర్వహించారు. కదిరి రోడ్డులోని లీ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ బెంగళూరు బస్ స్టాండ్ వరకు సాగింది.

 

ర్యాలీలో కరాటే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అకాడమీ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలంటూ నినాదాలు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జీవీఆర్ టవర్స్ యజమాని ఆవుల వెంకటరమణ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.

 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించడం ప్రతి పౌరుడి బాధ్యత అని, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి హరితహారాన్ని పెంపొందించాలని పిలుపునిచ్చారు. అనంతరం మాస్టర్ మురళి మాట్లాడుతూ, ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న ప్లాస్టిక్ కాలుష్యాన్ని అరికట్టేందుకు సమాజం మొత్తం ముందుకు రావాలని అన్నారు.

 

ప్లాస్టిక్ వినియోగం కారణంగా పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటోందని, వర్షాభావం, కాలుష్యం వంటి సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్లాస్టిక్ కాలుష్యాన్ని ఇప్పుడే నియంత్రించకపోతే భావితరాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. వేడి ఆహారాన్ని ప్లాస్టిక్ ప్లేట్లు, కవర్లు లేదా పాత్రల్లో తీసుకోవడం ఆరోగ్యానికి హానికరమని, అలాగే ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లలోని నీటిని తరచూ వినియోగించడం వల్ల సూక్ష్మ ప్లాస్టిక్ కణాలు శరీరంలోకి చేరే ప్రమాదం ఉందని వివరించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
విజయవాడ గొల్లపూడి వాసవి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్
గొల్లపూడి, వాసవి ఫార్మ మార్కెట్ కాంప్లెక్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం తృతియ...
By Rajini Kumari 2026-01-25 11:04:18 0 235
Andhra Pradesh
నల్లచెరువులో ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు
 భారత్ అవాజ్ న్యూస్:నల్లచెరువు మండలంలోని అంగన్వాడీ కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన...
By Vinod Kumar 2026-09-17 13:57:33 0 195
Andhra Pradesh
ఎన్టీఆర్ జయంతి .. ఘన నివాళులర్పించిన చంద్రబాబు, లోకేశ్.
ఎన్టీఆర్ 103వ జయంతి సందర్భంగా కుటుంబసభ్యుల ఘన నివాళి ఆయన ఆధునిక సంఘ సంస్కర్త అని కొనియాడిన సీఎం...
By Pagadala Venkateswar 2026-05-28 07:17:43 0 101
Andhra Pradesh
నిమ్మనపల్లిలో రోడ్డు ప్రమాదం.. రైతుకు తీవ్ర గాయాలు.
నిమ్మనపల్లి మండలంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నాగంవారిపల్లికి చెందిన రైతు నాగమహేశ్వర...
By Pagadala Venkateswar 2026-05-22 12:43:17 0 181
Andhra Pradesh
జిల్లా విద్యారంగ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి
యువగళం పాదయాత్రలో విద్యార్థులకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని...
By Boya Dasthagiri 2026-07-28 14:15:30 0 137
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com