అల్వాల్‌లో సబ్-రిజిస్ట్రార్ కార్యాలయానికి కీలక ముందడుగు.|

0
137

"ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి విజ్ఞప్తికి మంత్రి పొంగులేటి సానుకూల స్పందన.

బాలసదన్ భవనం పరిశీలన పూర్తి... త్వరలో సేవలు అందుబాటులోకి"

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, జూలై 10: అల్వాల్‌లో సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటు దిశగా కీలక ముందడుగు పడింది. మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి విజ్ఞప్తిపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

మంత్రి ఆదేశాల మేరకు జిల్లా రిజిస్ట్రార్ అశోక్ కుమార్, ఎమ్మెల్యేతో కలిసి అల్వాల్‌లోని సఖి సెంటర్ సమీపంలోని బాలసదన్ భవనాన్ని పరిశీలించారు. అవసరమైన మరమ్మతులు పూర్తి చేసి త్వరలోనే సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

అదేవిధంగా కౌకూర్‌లో 2BHK గృహాల నిర్మాణం, అల్వాల్‌లో భూదాన్ భూమిలో ఇళ్ల నిర్మాణం, అలాగే కొన్ని ULC భూములను 22-A నిషేధిత జాబితా నుంచి తొలగించి పెండింగ్ రిజిస్ట్రేషన్లు పునఃప్రారంభించాలని ఎమ్మెల్యే మంత్రిని కోరారు.

అల్వాల్‌లో సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం ప్రారంభమైతే స్థానికులతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు రిజిస్ట్రేషన్ సేవలు మరింత సులభంగా అందుబాటులోకి రానున్నాయి.

#Sidhumaroju

Alwal

Search
Categories
Read More
Telangana
అభయ అమృత వర్షిణి బదిరుల పాఠశాలలో పోలీసుల నూతన సంవత్సర వేడుకలు.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : మారేడ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని అభయ అమృత వర్షిణి బదిరుల...
By Sidhu Maroju 2026-01-01 13:50:48 0 214
Andhra Pradesh
అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ యోజన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు కలెక్టర్ నిశాంత్ కుమార్ టిడిపి అబ్జర్వర్ అన్న అనిత యాదవ్ గారు
*అన్నమయ్య జిల్లా – రాయచోటి నియోజకవర్గం* *📅 20-06-2026*   *🌾 రాయచోటి సాయి శుభకళ్యాణ...
By Benguluri Madhubabu 2026-06-20 12:21:07 0 190
Telangana
సికింద్రాబాద్ లో గంజాయి ముఠా గుట్టురట్టు : అల్వాల్ డెలివరీ బాయ్ తో సహా ఏడుగురు అరెస్ట్.|
  మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : నగరంలో మాదకద్రవ్యాల విక్రయాలే లక్ష్యంగా సాగుతున్న అక్రమ...
By Sidhu Maroju 2026-03-12 11:19:07 0 199
Andhra Pradesh
104 వైద్య బృందం ఆగస్తిగానిపల్లిలో వైద్య పరీక్షలు, మాత్రల పంపిణీ
చౌడేపల్లి మండలం కాటిపేరి పంచాయతీ, ఆగస్తిగానిపల్లిలో 104 ద్వార వైద్య పరీక్షలు, మరియు మాత్రలు...
By Kothuru Murali 2026-01-29 09:03:52 0 217
Delhi - NCR
బెట్టింగ్‌ యాప్స్‌ కేసులో ఈడీ దూకుడు!!!!!!!!!!!
ఢిల్లీ: బెట్టింగ్‌ యాప్స్‌ కేసులో ఈడీ దూకుడుబెట్టింగ్ ప్రమోట్‌ చేసిన సెలబ్రిటీల...
By SivaNagendra Annapareddy 2025-12-19 13:42:44 0 298
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com