ఈటల సమక్షంలో బీజేపీలో చేరికలు.|

0
128

"మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన 23 మంది పార్టీలో చేరిక.. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కార్యకర్తలకు సూచించిన ఎంపీ ఈటల రాజేందర్"

మేడ్చల్ మల్కాజిగిరి, జూలై 8: మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ సమక్షంలో మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని జీహెచ్‌ఎంసీ 62వ వార్డు బాలాపూర్‌కు చెందిన లావుడియా రజిత ఆధ్వర్యంలో 23 మంది భారతీయ జనతా పార్టీలో చేరారు.

బుధవారం షామీర్‌పేట్‌లోని తన నివాసంలో జరిగిన కార్యక్రమంలో ఎంపీ ఈటల రాజేందర్ పార్టీ కండువాలు కప్పి వారిని బీజేపీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ, భారతీయ జనతా పార్టీపై ప్రజల్లో రోజురోజుకూ విశ్వాసం పెరుగుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ప్రతి కార్యకర్త కీలక పాత్ర పోషించాలని సూచించారు. ప్రజలతో నిరంతరం మమేకమై పార్టీ సిద్ధాంతాలు, ప్రభుత్వ కార్యక్రమాలను విస్తృతంగా వివరించాలని పిలుపునిచ్చారు.

పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రజా సమస్యల పరిష్కారంలో చురుకుగా పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆకాంక్షించారు.

#Sidhumaroju

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
సీఎం చంద్రబాబుకు ప్రతిష్ఠాత్మక అవార్డు... ముంబైలో.
  సీఎం చంద్రబాబుకు ప్రతిష్ఠాత్మక అవార్డు... ముంబైలో.  Andhra CM Chandrababu will...
By Pagadala Venkateswar 2026-04-25 05:11:18 0 126
Andhra Pradesh
Boyakonda: ప్రముఖ పుణ్యక్షేత్రం బోయకొండ గంగమ్మ ఆలయంలో రాహుకాల అభిషేకం, విశేష పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. భక్తులకు ఉచిత అన్నప్రసాద వితరణ.
Boyakonda: శ్రీ బోయకొండ గంగమ్మకు వైభవంగా అభిషేకం ప్రత్యేక పూజలు   శక్తి స్వరూపిణి శ్రీ...
By Pagadala Venkateswar 2026-07-11 04:09:12 0 122
Telangana
12 న మంచిర్యాల జిల్లాలో పర్యటించనున్న కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈనెల 12న జిల్లాలో పర్యటించనున్నారు. శుక్రవారం హైదరాబాద్లో...
By Avunoori Mahesh 2026-04-10 12:18:18 0 239
Andhra Pradesh
నూజివీడు రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత
బ్రేకింగ్... నూజివీడు...   నూజివీడు రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..   ...
By Rajini Kumari 2025-12-29 08:46:14 0 211
Andaman & Nikobar Islands
Great Nicobar Census: Paving the Way for a Megaproject
The Andaman and Nicobar Islands administration has officially launched the long-awaited...
By Lokeshwari Panthadi 2026-06-30 08:01:38 0 78
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com