సీఎం చంద్రబాబుకు ప్రతిష్ఠాత్మక అవార్డు... ముంబైలో.

0
125

 

సీఎం చంద్రబాబుకు ప్రతిష్ఠాత్మక అవార్డు... ముంబైలో.

 Andhra

CM Chandrababu will visit Mumbai tomorrow 

ఎకనమిక్ టైమ్స్ 'బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ 2025' అవార్డుకు చంద్రబాబు ఎంపిక

పాలనలో సంస్కరణలు, పెట్టుబడుల ఆకర్షణకు గాను ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం

రేపు ముంబైలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా అవార్డు స్వీకరణ

కూటమి ప్రభుత్వం వచ్చాక రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించడంపై జ్యూరీ ప్రశంస

ముఖ్యమంత్రి ముంబై పర్యటన షెడ్యూల్ ఖరారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మరో అరుదైన జాతీయ స్థాయి గౌరవాన్ని అందుకోబోతున్నారు. దేశంలోని ప్రతిష్ఠాత్మక మీడియా సంస్థ ఎకనమిక్ టైమ్స్ ప్రకటించిన 'బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ 2025' అవార్డుకు ఆయన ఎంపికయ్యారు. రాష్ట్రంలో పాలనను పరుగులు పెట్టిస్తూ, వ్యాపార నిర్వహణను సులభతరం చేస్తూ ఆయన అమలు చేస్తున్న విప్లవాత్మక విధానాలకు గుర్తింపుగా ఈ పురస్కారం వరించింది. ఈ అవార్డును అందుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం ముంబైలో పర్యటించనున్నారు.

 

పాలనా సంస్కరణలకు పట్టం

 

'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్'తో పాటు 'స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్సు' వంటి విధానాలను పక్కాగా అమలు చేస్తూ, రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంలో చంద్రబాబు చూపుతున్న చొరవను ఎకనమిక్ టైమ్స్ జ్యూరీ ప్రత్యేకంగా ప్రశంసించింది. ముఖ్యంగా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే రాష్ట్రానికి సుమారు రూ.20 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను తీసుకురావడంలో ఆయన సఫలీకృతం కావడం ఈ అవార్డు ఎంపికలో కీలక పాత్ర పోషించింది. 

 

పారిశ్రామిక అనుమతుల ప్రక్రియను సరళతరం చేయడం, టెక్నాలజీ, ఐటీ, ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ వంటి భవిష్యత్ రంగాల్లో ఏపీని దేశంలోనే అగ్రగామిగా నిలపాలనే ఆయన లక్ష్యాన్ని జ్యూరీ కొనియాడింది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా హైదరాబాద్‌ను ప్రపంచ ఐటీ పటంలో నిలబెట్టిన అనుభవాన్ని ప్రస్తుత నవ్యాంధ్ర నిర్మాణంలోనూ చంద్రబాబు ప్రదర్శిస్తున్నారని పేర్కొంది.

 

ముంబైలో ఘనంగా కార్యక్రమం

 

ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో శనివారం సాయంత్రం 5:30 నుంచి 7:30 గంటల మధ్య ఈ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ దిగ్గజాల సమక్షంలో చంద్రబాబు ఈ పురస్కారాన్ని స్వీకరిస్తారు. గతంలో ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును అరుణ్ జైట్లీ, పీయూష్ గోయల్, నితీష్ కుమార్, అశ్వినీ వైష్ణవ్, ఎస్. జై శంకర్ వంటి ప్రముఖులు అందుకున్నారు. వారి సరసన ఇప్పుడు చంద్రబాబు చేరనున్నారు.

 

సీఎం పర్యటన షెడ్యూల్ ఇలా..

 

ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం అమరావతి నుంచి ముంబైకి వెళ్లనున్నారు. ఆయన పర్యటన షెడ్యూల్ ఈ విధంగా ఉంది...

శనివారం మధ్యాహ్నం 12:50 గంటలకు: ముఖ్యమంత్రి తన క్యాంపు కార్యాలయం నుంచి గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరుతారు.

మధ్యాహ్నం 2:40 గంటలకు: ముంబై విమానాశ్రయానికి చేరుకుంటారు.

సాయంత్రం 5:25 గంటలకు: అవార్డుల కార్యక్రమం జరిగే జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌కు వెళ్తారు.

రాత్రి 9:30 గంటల వరకు: ఎకనమిక్ టైమ్స్ అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొంటారు.

రాత్రి 9:50 గంటలకు: ముంబై నుంచి విమానంలో తిరిగి అమరావతికి పయనమవుతారు.

Search
Categories
Read More
Telangana
దశాబ్దాల భూ సమస్య.. ఈటల రాజేందర్‌ను ఆశ్రయించిన బాధితులు.|
● అన్మత్ నగర్, హయత్ నగర్ భూ సమస్యలపై ఎంపీని కలిసిన బాధితులు ● 50 ఏళ్ల క్రితం ఇచ్చిన భూముల్లో...
By Sidhu Maroju 2026-08-01 12:05:26 0 137
Andhra Pradesh
పుంగనూరు: మధ్యాహ్న భోజనంలో పడ్డ బల్లి
అన్నమయ్య జిల్లా, పుంగనూరులోని మున్సిపల్ అప్పర్ ప్రైమరీ స్కూల్లో బుధవారం మధ్యాహ్న భోజనంలో బల్లి...
By Kothuru Murali 2026-04-02 06:10:55 0 179
Andhra Pradesh
లింగ వివక్షత చూపితే చర్యలు తీసుకోండి
లింగ వివక్షత చూపితే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆర్డీవో రామ్మోహనరావు ఆదేశించారు. బొబ్బిలి...
By Boiena Rajesh 2026-03-28 13:43:31 0 253
Bharat Aawaz
India's Gold Loan Crisis: Survival Debt Traps Middle Class
In India, gold is not a mere ornament; it represents generational savings, deep emotion, and...
By Hazu MD. 2026-06-06 09:51:05 0 405
Andhra Pradesh
జోగి రమేష్ , జోగి రాముకి బైలు
AP: నకిలీ మద్యం కేసులో వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి జోగి రమేష్ సోదరులకు భారీ ఊరట లభించింది. జోగి...
By Pagadala Venkateswar 2026-01-23 11:03:57 0 258
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com