U.S. Wields Oil Sanctions Weapon Against Iran Again

2
630

ఇరాన్‌పై మళ్లీ అమెరికా చమురు ఆంక్షల అస్త్రం

 

వాషింగ్టన్‌: ఇరాన్‌పై అమెరికా మరోసారి చమురు ఆంక్షల అస్త్రాన్ని ప్రయోగించింది. ఇరాన్‌ చమురు ఉత్పత్తి, సరఫరా, విక్రయాలకు సంబంధించి గత నెలలో ఇచ్చిన ఆంక్షల మినహాయింపును డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం రద్దు చేసింది. అమెరికా ఆర్థిక శాఖకు చెందిన విదేశీ ఆస్తుల నియంత్రణ కార్యాలయం గతంలో జారీ చేసిన సాధారణ అనుమతిని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 

 

అమెరికా–ఇరాన్ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం అమలు పూర్తిగా ఇరాన్‌ ప్రవర్తనపైనే ఆధారపడి ఉంటుందని ట్రంప్‌ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇరాన్‌ తన బాధ్యతలను పాటిస్తేనే ఒప్పందం ద్వారా లభించే ప్రయోజనాలను పొందగలదని పేర్కొంది. అమెరికా ప్రయోజనాలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. 

 

గత నెలలో ఇరాన్‌ చమురు, పెట్రోలియం ఉత్పత్తుల విక్రయాలకు ఆగస్టు 21 వరకు తాత్కాలిక అనుమతి ఇచ్చిన అమెరికా, తాజా పరిణామాల నేపథ్యంలో దానిని వెనక్కి తీసుకుంది. అయితే ఇప్పటికే ప్రారంభమైన లావాదేవీలను ముగించేందుకు జూలై 17 వరకు గడువు ఇచ్చినట్లు సమాచారం. ఈ నిర్ణయంతో ఇరాన్‌ చమురు ఎగుమతులపై మళ్లీ ఆంక్షల ఒత్తిడి పెరగనుంది.

Search
Categories
Read More
Andhra Pradesh
కడప జిల్లా పర్యటనకు విచ్చేసిన మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన చెమర్తి జగన్మోహన రాజు
    నేడు కడప జిల్లా పర్యటనకు విచ్చేసిన మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారిని...
By Benguluri Madhubabu 2026-07-15 03:16:55 1 347
Andhra Pradesh
పండగలో అల్లర్లు, గొడవలు చేస్తే కఠిన చర్యలు
పండగలో గొడవలు, అల్లర్లు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పట్టణ సీఐ కె.నారాయణరావు అన్నారు. బొబ్బిలి...
By Boiena Rajesh 2026-04-27 05:44:02 0 235
Andhra Pradesh
ఏపీలో ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌.. మదనపల్లెలో 100 ఎకరాల్లో ఏర్పాటు.
ఆంధ్రప్రదేశ్‌లో ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ (ఐఎస్‌ఏ)...
By Pagadala Venkateswar 2026-08-13 05:36:37 0 86
Andhra Pradesh
Madanapalle: మదనపల్లె నియోజకవర్గం పొన్నెటిపాలెం గ్రామం చిప్పిలి వద్ద ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్ఠ. పాల్గొని నివాళులర్పించిన టీడీపీ సీనియర్ నాయకులు మండిపల్లి మధుసూదన్ రెడ్డి.
Madanapalle: మదనపల్లె నియోజకవర్గం పొన్నెటిపాలెం గ్రామం చిప్పిలి వద్ద దివంగత మాజీ ముఖ్యమంత్రి,...
By Pagadala Venkateswar 2026-08-31 13:09:20 0 86
Andhra Pradesh
పుంగనూరు:పుంగనూరు పట్టణం లో ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్‌లో వివిధ కేసులలో పట్టుబడిన వాహనాలను ఈనెల 16న ఉదయం 10:30 గంటలకు వేలం.
పుంగనూరు పట్టణంలోని ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్‌లో వివిధ కేసులలో పట్టుబడిన వాహనాలను...
By Kothuru Murali 2026-03-15 10:17:50 0 202
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com