ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతి సమీపంలో వకుళ మాత ఆలయంలో అక్షరాభ్యాసం

0
99

ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతి సమీపంలో వకుళ మాత ఆలయంలో అక్షరాభ్యాసం - అన్నప్రాసన మండపాన్ని ప్రారంభించిన టీటీడీ చైర్మన్ బి ఆర్ నాయుడు గారు, ఎమ్మెల్యే పులివర్తి నాని గారు.

కార్యక్రమానికి విచ్చేసిన చైర్మన్ గారికి, ఎమ్మెల్యే గారికి ఘన స్వాగతం పలికిన టీటీడీ అధికారులు, ప్రజలు, కూటమి నాయకులు.

కూటమి ప్రభుత్వం ఆలోచన విధానం... టీటీడీ సౌజన్యంతో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తల్లి గారైన వకుళమాతా దేవి ఆలయంలో అక్షరాభ్యాసం మండపం నిర్మించడం శుభపరిణామం.

ఈ కార్యక్రమానికి ఆలయం వద్దకు భారీగా తరలివచ్చిన చిన్న పిల్లల తల్లిదండ్రులు, భక్తులు.

వకుళామాత ఆలయ ప్రాంగణంలో సాంప్రదాయబద్ధంగా.. భక్తిశ్రద్ధల నడుమ సాగిన చిన్నారుల అక్షరాభ్యాసం, అన్నప్రాశన కార్యక్రమాలు.

చిన్నారులకు స్వయంగా అక్షరాభ్యాసం చేయించి, ఆశీస్సులు అందజేసి... వారికి అక్షర గోవిందం కిట్లను అందజేసిన టీటీడీ చైర్మన్ గారు, ఎమ్మెల్యే గారు.

మంగళవారం రోజు తప్ప మిగిలిన రోజులలో వేద పండితులు చెప్పిన సమయంలో కార్యక్రమాలు నిర్వహణ.

ఆలయం వద్దకు వచ్చిన ​భక్తులకు, చిన్నారులకు అన్నీ రకాల హంగులతో విస్తృత ఏర్పాట్లు చేసిన టీటీడీ అధికారులు.

ఈ కార్యక్రమంలో తిరుపతి నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ జె బి శ్రీనివాస్ గారు, టీటీడీ పాలక మండలి సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి గారు, పనభాక లక్ష్మీ గారు, కూటమి నాయకులు, భక్తులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
సీఎం చంద్రబాబుకు ఉద్యోగ సంఘాల కృతజ్ఞతలు.. కేబినెట్ నిర్ణయాలపై హర్షం.
ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై కేబినెట్ సానుకూల నిర్ణయాలు పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచడంపై నేతల...
By Pagadala Venkateswar 2026-06-24 04:32:34 0 106
Andhra Pradesh
ఏపీ లిక్కర్ స్కాం నిందితుల రిమాండ్
విజయవాడ : ఏపీ లిక్కర్‌ స్కాం కేసులో నిందితుల రిమాండ్‌ పొడిగింపు.   నిందితుల...
By Rajini Kumari 2025-12-19 11:25:46 0 255
Telangana
జీవితాంతం మంత్రిగా ఉన్న అభివృద్ది చేయలేవు
మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మహబూబాబాద్ ,కొత్తగూడ డిసెంబర్ 14 (భారత్ ఆవాజ్):మూడవ విడత...
By Bheeshman King 2025-12-14 13:42:01 0 407
Andhra Pradesh
జనసేన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు 
జనసేన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు ...
By Chennaiah Kati 2026-07-10 07:31:57 0 110
Telangana
ఓటర్ల హియరింగ్‌ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలి ఆసిఫాబాద్ కలెక్టర్ హరిత
🎤 ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్:  కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అనామలీస్, మ్యాపింగ్ కాని...
By Chunarkar Jagadeesh 2026-09-01 14:27:42 0 427
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com