సీఎం చంద్రబాబుకు ఉద్యోగ సంఘాల కృతజ్ఞతలు.. కేబినెట్ నిర్ణయాలపై హర్షం.

0
106

ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై కేబినెట్ సానుకూల నిర్ణయాలు

పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచడంపై నేతల హర్షం

కొందరు ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం అమలుకు మార్గం సుగమం

రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని ఉద్యోగులకు సీఎం పిలుపు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల దీర్ఘకాలిక డిమాండ్లను పరిష్కరిస్తూ రాష్ట్ర మంత్రిమండలి తీసుకున్న కీలక నిర్ణయాల పట్ల ఉద్యోగ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును సచివాలయంలో కలిసి వారు కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపినందుకు ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేశారు.

 

పలు విభాగాల్లో ఉద్యోగుల పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచడం, పాత పెన్షన్ విధానం (OPS) వర్తింపజేయడం వంటి నిర్ణయాలు వేలాది మంది ఉద్యోగులకు, వారి కుటుంబాలకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తాయని నేతలు పేర్కొన్నారు. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న సమస్యలకు పరిష్కారం లభించడం పట్ల వారు సంతోషాన్ని వెలిబుచ్చారు.

 

కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (CPS) నోటిఫికేషన్‌కు ముందే నియామక ప్రక్రియ పూర్తయి, ఆ తర్వాత విధుల్లో చేరిన వారికి పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేస్తూ ప్రభుత్వం మార్గం సుగమం చేసింది. ప్రభుత్వ నిర్ణయాలు ఉద్యోగ వర్గాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయని నేతలు అభిప్రాయపడ్డారు.

 

ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఏపీ జేఏసీ చైర్మన్ విద్యాసాగర్, ప్రధాన కార్యదర్శి ప్రసాద్, ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి నాపా ప్రసాద్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి కోసం ఉద్యోగులందరూ కలిసికట్టుగా కృషి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారికి సూచించారు

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లిలో టమాటా ధరలు పతనం.
మదనపల్లె మార్కెట్‌కు 391 మెట్రిక్ టన్నుల టమాటాలు ఆదివారం వచ్చాయి. గత 3 రోజులుగా టమాటా ధరలు...
By Pagadala Venkateswar 2026-05-11 06:14:19 0 158
Telangana
జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ' బతుకమ్మ' గ్లింప్స్ ... శ్రీను రావు పొన్నాల
తెలంగాణ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ ను నాటి పరిస్థితులను, సాంకేతికతను...
By Ponnala Srinivasrao 2026-05-07 04:25:39 0 170
Telangana
సర్జరీలో వేగం.. వైద్యంలో కచ్చితత్వం : మెడికవర్ రోబోటిక్ విభాగాన్ని ప్రారంభించిన హైదరాబాద్ సిపి.|
సికింద్రాబాద్ :  అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం తో మెరుగైన వైద్య సేవలను అందిస్తూ మెడికవర్...
By Sidhu Maroju 2026-01-21 10:31:44 0 225
Andhra Pradesh
శశాంక్ కనుమూరికి CM అభినందనలు
*Photo:* రాష్ట్రానికి చెందిన ఈక్వేస్టేరియన్ ఈవెటింగ్ క్రీడాకారుడు శశాంక్ కనుమూరి ముఖ్యమంత్రి...
By Rajini Kumari 2025-12-25 07:36:58 0 229
Andhra Pradesh
మదనపల్లెలో హోటల్‌లో చోరీ.. నగదు, వస్తువులు అపహరణ.
మదనపల్లె మునిసిపల్ పార్క్ సమీపంలోని టీ డెన్ హోటల్‌లో శుక్రవారం రాత్రి దొంగలు చోరీకి...
By Pagadala Venkateswar 2026-03-28 12:18:06 0 223
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com