కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు సకాలంలో నిర్వహించక పోవడం వల్ల సమస్యలు ఉత్పన్నం. ఎమ్మెల్యే శ్రీ గణేష్.

0
1K

కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు సకాలంలో నిర్వహించకపోవడం వల్ల కాలనీలలో చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కారానికి నోచుకోవడం లేదని ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు. ఈరోజు వార్డు 5 జ్యోతి కాలనీ రోడ్ నెంబర్ 2 లో ఎమ్మెల్యే శ్రీ గణేష్ కాలనీ వాసులతో కలిసి పర్యటించారు. కాలనీవాసులు తమకు కనీస అవసరాలు అయిన చెత్త సేకరణ, నీటి సరఫరా, వీధి దీపాల ఏర్పాటు, భూగర్భ డ్రైనేజీ సక్రమంగా లేకపోవడం తదితర పనులను బోర్డు పట్టించుకోవడంలేదని ఎమ్మెల్యే శ్రీగణేష్ దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులను పిలిపించుకుని వారి సమస్యలను వివరించి త్వరగా వీటి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.అనంతరం కాలనీ వాసులతో ఎమ్మెల్యే మాట్లాడుతూ బోర్డు ఎన్నికలు నిర్వహించకపోవడం వలన ఇలాంటి చిన్న చిన్న పనులను కూడా ఎమ్మెల్యే పట్టించుకోవలసి వస్తుందని, అదే బోర్డు ఎన్నికలు నిర్వహించినట్లయితే ప్రతి వార్డుకు ఒక ప్రజా ప్రతినిధి ఉంటాడని, అతను ఇలాంటి చిన్న చిన్న సమస్యలను బోర్డు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తారని, గతంలో ఇక్కడ వార్డు సభ్యులుగా, నామినేటెడ్ సభ్యులుగా పని చేసిన వారు పదవులపై ఉన్న శ్రద్ధను ప్రజలకు సేవ చేయడంలో చూపించలేదని, అందుకే ఇలాంటి సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని, ఇప్పటికైనా ప్రజలు కూడా ఆలోచించుకుని వారికి అందుబాటులో ఉండే వారిని ఎన్నికలలో ఎన్నుకుంటే ఈ సమస్యలు ఉండవని, నేను నిత్యం అందుబాటులో ఉంటానని, అలాగే బోర్డు ఎన్నికలు నిర్వహించినట్లయితే సమర్ధులకు, నిత్యం అందుబాటులో ఉండే వారికి ఓట్లు వేసి గెలిపించుకోవాలని కాలనీ వాసులకు సూచించారు.

Like
1
Search
Categories
Read More
Andhra Pradesh
పంట ధరల స్థిరీకరణకు కోల్డ్ చైన్ ప్రణాళిక |
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, వ్యవసాయ మార్కెట్ కమిటీలలో కోల్డ్ చైన్ మౌలిక...
By Deepika Doku 2025-10-10 06:44:37 0 46
Telangana
రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే పద్మారావు
సికింద్రాబాద్/ కంటోన్మెంట్. రాజకీయాలకు అతీతంగా రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని రవాణా...
By Sidhu Maroju 2025-08-02 15:23:28 0 637
Legal
Supreme Court Dismissed Lalit Modi's Plea
The Supreme Court on Monday dismissed a plea by former cricket administrator Lalit Modi, who had...
By Bharat Aawaz 2025-07-03 08:45:12 0 2K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com