దళిత, క్రైస్తవ సోదరుల హక్కుల పరిరక్షణకు, సంక్షేమానికి నిరంతరం కట్టుబడి ఉంటాం

0
98

దళిత, క్రైస్తవ సోదరుల హక్కుల పరిరక్షణకు, సంక్షేమానికి నిరంతరం కట్టుబడి ఉంటాం...

ఈరోజు మార్కాపురంలో ఎమ్మార్పీఎస్ (MRPS) అనుబంధ సంఘాలైన మాదిగ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (MEF), మహాజన సోషల్ పార్టీ (MSP), దళిత క్రిస్టియన్ ఐక్యవేదిక ప్రతినిధులు మరియు స్థానిక చర్చి పాస్టర్లు నన్ను మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

ఈ భేటీలో MEF జాతీయ అధ్యక్షులు బొంత ఏసుదాసు గారు, రాష్ట్ర అధ్యక్షులు బిక్షాలు గారు, ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షులు కత్తి ఐజాక్ గారు, MSP జాతీయ ఉపాధ్యక్షులు ఎలగంటి నర్సింగ్ గారు, ఇతర ముఖ్య నాయకులు మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

గతంలో (01-07-2026న) చారిత్రాత్మక ఏబీఎం (ABM) హైస్కూల్ భూములను ఆక్రమణల నుండి కాపాడి, తిరిగి పాఠశాలను విజయవంతంగా ప్రారంభించేలా ప్రభుత్వం ద్వారా తీసుకున్న చొరవ పట్ల వారు హర్షం వ్యక్తం చేస్తూ, కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ సందర్భంగా వారితో మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని దళిత, క్రైస్తవ సోదరులకు ఏ కష్టం వచ్చినా వారికి అండగా నిలబడటం ప్రజాప్రతినిధిగా నా బాధ్యత అని తెలియజేశాను. సమాజంలోని ప్రతి పేదవాడికి, బడుగు బలహీన వర్గాలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం శ్రమిస్తానని ఈ సందర్భంగా వారికి భరోసా ఇచ్చాను.

Search
Categories
Read More
Andhra Pradesh
AP Government: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. మత్స్యకారులకు ఇకపై రూ.10 లక్షల బీమా.
ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.10 లక్షల బీమా పరిహారం   ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన కింద సాయం...
By Pagadala Venkateswar 2026-01-19 06:57:34 0 240
Andhra Pradesh
మౌలిక వసతులు లోపిస్తే సంబంధిత అధికారులపై చర్యలు
*మౌలిక వసతులు లోపిస్తే సంబంధిత అధికారులపై చర్యలు*      *సెక్యూరిటీ, శానిటేషన్...
By Rajini Kumari 2026-02-23 10:23:51 0 206
Telangana
మేడ్చల్ జిల్లాలో అంబేద్కర్ జయంతి (ఏప్రిల్ 14) వేడుకలు ప్రతి ఏటా ఘనంగా జరుగుతాయి.
మేడ్చల్ నియోజకవర్గం పరిధిలో ఈ రోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ...
By Thalakayala Nagashiva 2026-04-15 05:11:17 0 356
SURAKSHA
Ahmed Nadeem IAS: Leading Governance with Vision
A distinguished Telangana IAS officer whose leadership, administrative expertise, and commitment...
By Lokeshwari Panthadi 2026-07-10 08:33:23 0 262
Andhra Pradesh
ప్రభుత్వ భూముల ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలి: బహుజన యువసేన.
మదనపల్లె ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లోని విలువైన APIIC ప్రభుత్వ ఖాళీ ప్లాట్లను కొందరు వ్యక్తులు...
By Pagadala Venkateswar 2026-06-23 06:03:51 0 108
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com