మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం

0
2K

*_ఒకే కుటుంబానికి చెందిన 9మంది దుర్మరణం_* *_మధ్యప్రదేశ్​ రాష్ట్రంలో ఝబువా జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రైల్వే క్రాసింగ్ సమీపంలో ముందు నుంచి వస్తున్న వ్యాన్​ను లారీ ఢీకొట్టింది._* *_ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మృతి చెందారు, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు._* *_బాధితులు ఒకే కుటుంబానికి చెందిన వారు కాగా, వీరంతా వివాహానికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది._* *_మేఘ్​నగర్ తహసీల్​ ప్రాంతంలోని సంజెలి రైల్వే క్రాసింగ్ సమీపంలోని తాత్కాలిక రహదారి నిర్మాణం జరుగుతుంది._* *_ఈ క్రమంలో ఓవర్​- బ్రిడ్జ్​ని సిమెంట్ లోడ్​తో ఉన్న లారీ దాటుతుండగా అదుపు తప్పి ప్యాసింజర్స్​ ఉన్న వ్యాన్​పై బోల్తా పడిందని ఝబువా సూపరిటెండెంట్​ పద్మవిలోచన్ శుక్లా తెలిపారు._* *_ఈ ప్రమాదంలో 9మంది మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. దీంతో వ్యాన్ పూర్తిగా ధ్వంసమైందని చెప్పారు._* *_మృతుల్లో నలుగురు పిల్లలు, ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. చనిపోయిన వారిలో ముఖేష్ (40), సావ్లి (35), వినోద్ (16), పాయల్ (12), మధి (38), విజయ్ (14), కాంత (14 ), రాగిణి (9), అకాలి (35), పాయల్ సోమ్లా పర్మార్ (19 ), అషు (5 ) ఉన్నారు._* *_ఘటన జరిగిన తర్వాత లారీ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. గాయపడిన వారితో పాటు మృత దేహాలను పోలీసులు ఆస్పత్రులకు తరలించారు._*

Search
Categories
Read More
Andhra Pradesh
కాకినాడ కలెక్టరేట్‌లో అధికారులతో పవన్ సమీక్ష |
నేడు తూర్పు గోదావరి జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన జరుగుతోంది. ఉదయం కాకినాడ...
By Bhuvaneswari Shanaga 2025-10-09 06:49:48 0 30
Telangana
జిల్లాల వారీగా పత్తి కొనుగోలు కేంద్రాల ప్రకటన |
తెలంగాణ రాష్ట్రంలో పత్తి రైతులకు శుభవార్త. సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) పత్తి కొనుగోలు...
By Bhuvaneswari Shanaga 2025-10-18 09:40:34 0 42
Jammu & Kashmir
Intense Heatwave Scorches Jammu & Kashmir: Record Temperatures Raise Alarms
Intense Heatwave Scorches Jammu & Kashmir: Record Temperatures Raise Alarms Jammu/Srinagar,...
By BMA ADMIN 2025-05-23 10:15:00 0 2K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com