కుషాయిగూడ, అల్వాల్ పి.హెచ్. సి.లకు క్యాన్సర్ పరీక్ష పరికరాలు మహతి ఫౌండేషన్ సహకారంతో అందించిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్.

0
1K

 

అల్వాల్ ల్లో జరిగిన ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి. 

ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ- నాకు ఆరోగ్య శాఖతో చాలా అనుబంధం ఉంది. దీంట్లో ఎన్ని బాధలు ఉంటాయో నేను కళ్ళారా చూశాను.ఈ శాఖ ఎంత బలపడితే, ఎంత గొప్పగా పని చేస్తే ప్రజలకి పేదరికం నుండి బయటపడే ఆస్కారం ఉంటుంది. వైద్యానికి అయ్యే వచ్చే ఖర్చు అనుకోకుండా వచ్చే ఖర్చు. తల్లి ప్రేమకు ధనిక, పేద తేడా ఉండదు. ఎంత టెక్నాలజీ పెరిగిన క్యాన్సర్ మరణాలు రోజురోజుకు పెరుగుతున్నాయి.నవరత్నాలలో మీ కంపెనీ ఉన్నందుకు గర్వపడుతున్నాను. ప్రజలకోసం ముందుకు వచ్చి డబ్బులు ఇస్తున్నందుకు సంతోషం.గరీబోళ్ల అడ్డా అంటే మల్కాజ్గిరి. ఎవరు పొట్ట చేత పట్టుకొని వచ్చిన మొదట ఉండేది మల్కాజ్గిరి లోనే. అందుకే దీన్ని మినీ ఇండియా అంటారు. హైదరాబాద్ అనగానే హైటెక్ సిటీ చూసి మనం మురిసిపోకూడదు,దాని పక్కనే దుఃఖాలతో నిండిన బస్తీలు ఉంటాయి. వాళ్లకి మనం అండగా ఉండాలి.కొంతమంది తాగి ఆరోగ్యాన్ని చెడగొట్టుకోవచ్చు కానీ పేద కుటుంబాలు అప్పుల పాలు కావడానికి ఒక ప్రధానమైన కారణం వైద్యం. ఈ జిల్లా మొత్తంలో ఏ హాస్పిటల్లో ఏ సౌకర్యాలు కావాలో నాకు రాసిఇవ్వండి తప్పకుండా మీకు ఇప్పించే ప్రయత్నం చేస్తాను. కొత్తగా మంత్రి అయిన నాడు MNJ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో , NIMS లో పెట్ స్కాన్ లేదు. నేను 25 కోట్లతో రెండు పెట్ స్కాన్లు తీసుకొచ్చి పెట్టాను. మీలాంటి ఒక సంస్థను రిక్వెస్ట్ చేసి 17 కోట్లతో కేంద్ర సెంటర్ ను ఏర్పాటు చేశాము. వైద్యం నారాయణనో హరి. డాక్టర్ల జీతాలు ఏంటి, మీ సమస్యలు ఏంటి, మీ కష్టాలు ఏంటో నాకు తెలుసు. డాక్టర్లకు జీతాలు అతితక్కువ ఉంటున్నాయి. డాక్టర్స్ కి కడుపునిండా జీతం ఇచ్చి పని చేయించుకోండి. ఎన్నో వేల కోట్లు దేనికో ఖర్చు పెడుతున్నాము కానీ ఈ శాఖకు ఖర్చు పెడితే ఫ్రూటిఫుల్ ఎక్స్పెండిచర్ అని చెప్పాను.ఆశావర్కర్లకి జీతాలు సరిగాలేవు. మీకు కూడా మంచి రోజులు వస్తాయి.నాకు వేరే వ్యాపకం లేదు. సమస్యలు నా దృష్టికి తీసుకొని రండి వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తాను. ఎంత పని చేసినా మీ ఋణం తీర్చుకోలేనిది అని ఈటల రాజేందర్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఆల్వాల్ కార్పొరేటర్ చింతల శాంతి శ్రీనివాస్ రెడ్డి,IOCL CGM ARV బద్రీనాథ్, DMHO మేడ్చల్ - మల్కాజ్గిరి Dr. C. ఉమా గౌరీ, నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ మెంబెర్ శ్రీనివాస్ రెడ్డి, డైరెక్టర్ రమేష్ శేఖర్ రెడ్డి, జిల్లా బీజేపీ జనరల్ సెక్రెటరీ మాణిక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Like
1
Search
Categories
Read More
Bharat Aawaz
గళం మీది. వేదిక మనది.
తీరం ఒడ్డున నిలబడితే మార్పు రాదు. ప్రవాహంలో భాగమైనప్పుడే చరిత్ర లిఖించబడుతుంది. మీదొక కథ అయినా,...
By Bharat Aawaz 2025-07-08 18:37:46 0 896
West Bengal
১৭ সেপ্টেম্বর বিশ্বকর্মা পূজা রাজ্যে সরকারি ছুটি ঘোষণা
রাজ্যের মুখ্যমন্ত্রী #মমতা_বন্দ্যোপাধ্যায় ঘোষণা করেছেন যে ১৭ সেপ্টেম্বর...
By Pooja Patil 2025-09-11 11:20:53 0 79
Andhra Pradesh
ఏపీ అద్దె రైతులు కొత్త టెనెన్సీ చట్టం కోరుతున్నారు |
ఆంధ్రప్రదేశ్‌లో అద్దె రైతులు తమ హక్కులు రక్షించడానికి కొత్త టెనెన్సీ చట్టం ఆమోదించాలని...
By Bhuvaneswari Shanaga 2025-09-23 06:25:04 0 50
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com