చదువు ఇష్టం లేక, కుటుంబ కలహాలతో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య!

0
461

మహబూబాబాద్::: కొత్తగూడ మండలంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పొగుళ్లపల్లి గ్రామానికి చెందిన పెండ్లి చందన (17) అనే ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థిని బుధవారం తన స్వగృహంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. చందన అమీనాబాద్‌లోని మోడల్ కాలేజీలో చదువుతోంది. వివరాల్లోకి వెళ్తే...మృతురాలి తండ్రి రాజేందర్, తల్లి దేవేంద్ర బతుకుదెరువు కోసం హైదరాబాద్‌లో కూలి పనులు చేసుకుంటూ నివసిస్తున్నారు. ఈ క్రమంలో చందన మహేశ్వరంలోని తన పెద్దమ్మ ఇంట్లో ఉంటూ కాలేజీకి వెళ్లి వస్తోంది. బుధవారం ఉదయం ఎప్పటిలాగే కాలేజీకి వెళ్తానని చెప్పి బయలుదేరిన చందన.. కాలేజీకి వెళ్లకుండా నేరుగా పొగుళ్లపల్లిలోని తన సొంత గ్రామానికి వచ్చింది. ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి వెళ్లి చున్నీతో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది.

​ సూసైడ్ లెటర్ లభ్యం

ఆత్మహత్యకు పాల్పడడానికి ముందు చందన రాసిన ఒక లేఖ (సూసైడ్ లెటర్) ఘటనా స్థలంలో లభ్యమైంది. ఆ లేఖలో.. తనకు చదువుకోవడం అస్సలు ఇష్టం లేదని, కానీ తల్లిదండ్రులు మాత్రం చదువుకోవాలంటూ తరచూ మందలిస్తున్నారని పేర్కొంది. అంతేకాకుండా, ఇంట్లో నిరంతరం జరుగుతున్న కుటుంబ కలహాల వల్ల తాను తీవ్ర మనస్థాపానికి గురయ్యానని, అందుకే ఈరోజు ఉరివేసుకుని చనిపోతున్నానని లేఖలో రాసి పెట్టింది. మృతురాలికి ఒక చిన్న చెల్లెలు ఉంది.

పోలీసుల దర్యాప్తు:

కూతురి మరణవార్త విని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతురాలి తండ్రి రాజేందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొత్తగూడ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసును దర్యాప్తు చేస్తున్నట్లు కొత్తగూడ ఎస్సై (SI) తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గ: రోడ్డు ప్రమాదంలో డిగ్రీ విద్యార్థి మృతి.. మరొకరి పరిస్థితి విషమం
పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం బత్తలపురం గ్రామానికి చెందిన డిగ్రీ విద్యార్థులు సాయి తేజ్,...
By Kothuru Murali 2026-07-30 13:28:37 0 242
Jharkhand
Jharkhand Promotes Tourism and Cultural Heritage Growth
Jharkhand continues to strengthen its tourism sector by promoting its rich natural landscapes,...
By Fathima Safa 2026-07-03 15:29:37 0 149
Telangana
పెద్దపల్లి ఎంపీ వంశీ కృష్ణ మంచిర్యాల పర్యటన వివరాలు
మంచిర్యాల :మధ్యాహ్నం 03:15 గంటలకు మంచిర్యాల రైల్వే స్టేషన్ అమృత్ భారత్ పథకం కింద జరుగుతున్న...
By Avunoori Mahesh 2026-04-08 07:20:54 0 267
Telangana
ఆర్టీసీ కార్మికులు సమ్మెను విరమించాలని రాష్ట్ర మంత్రిమండలి విజ్ఞప్తి
ఆర్టీసీ కార్మికులు సమ్మెను విరమించాలని రాష్ట్ర మంత్రిమండలి విజ్ఞప్తి చేసింది. చర్చల ద్వారా...
By Ponnala Srinivasrao 2026-04-24 00:49:44 0 145
Telangana
పరేడ్ గ్రౌండ్ లో అమరవీరుల స్తూపానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ :
సికింద్రాబాద్/సికింద్రాబాద్. సికింద్రాబాద్..   కార్గిల్ యుద్ధంలో భారత సైన్యం...
By Sidhu Maroju 2025-07-26 08:15:12 0 933
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com