ఇంటి స్థలాలు కై కలెక్టరేట్ ముట్టడి

0
518

ట్రాక్టర్ ఫై గుడిసె వేసి ఇంటి నమూనాలతో వినూత్న ప్రదర్శన

 

ఆందోళన ఉద్రిక్తం 40 మంది సిపిఐ నేతల అరెస్ట్

MAHABUBABAD: నేడు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఇంటి స్థలాలు ఇంటి పట్టాలు ఇంటి నెంబర్లకై కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ట్రాక్టర్పై గుడిసె వేసి ఇంటి నమూనాలతో వినూత్న ఆందోళన నిర్వహించారు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళన నిర్వహించారు ఈ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత 40 మంది సిపిఐ నేతల అరెస్టు టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలింపు  సందర్భంగా ఆందోళనలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న సీపీఐ జిల్లా కార్యదర్శి బి.విజయసారథి మాట్లాడుతూ ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇచ్చేవరకు సిపిఐ పోరాటం ఆగదన్నారు జిల్లా కేంద్రంలో వందలాది ప్రభుత్వ స్థలాలు ఉన్న ప్రభుత్వం నిరుపేదలకు ఇంటి స్థలాలు పంచడం లేదన్నారు జిల్లా కేంద్రంలో రియాల్టర్లు భూ కబ్జా కారులు అక్రమంగా ధరణి, భూ భారతి పేరిట రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారు అన్నారు. ప్రభుత్వానికి ,జిల్లా అధికారులకు కళ్ళు కనిపించట్లేవా అన్నారు పేదలు 80 గజాల్లో గుడిసెలు వేసుకుంటే అక్రమంగా కూల్చేసి కేసులు పెడతారా అని హెచ్చరించారు. వెంటనే సిపిఐ నేతలు గుడిసె వాసులపై అక్రమ కేసులు ఎత్తివేసి నిరుపేదలకు ఇంటి స్థలాలు పంచాలన్నారు. జిల్లా కేంద్రంలో వేలాదిమందికి ఇంటి నెంబర్లు ఇంటి పట్టాలు లేవన్నారు గత ప్రభుత్వం పదివేల మంది అప్లై చేసుకుంటే కేవలం 600 మందికి ఇచ్చి చేతులు దులుపుకుందన్నారు ఇందిరమ్మ పేరిట ఈ ప్రభుత్వం ఇంటి పట్టాలు ఉంటేనే ఇస్తామంటున్నారు కానీ ప్రభుత్వం ఇంతవరకు ఇంటి పట్టాలు ఇవ్వడం లేదన్నారు వెంటనే ప్రభుత్వం ఇంటి పట్టాలు ఇంటి నెంబర్లు ఇవ్వాలన్నారు జిల్లా కేంద్రంలో సుమారు పదివేల రూపాయలు ఇంటికి రాయిలు కట్ట ఇక ఇబ్బందుల పాలు కొంతమంది ఆత్మహత్యల పాలవుతున్నారన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలన్నారు ఇంటి స్థలాలు పేదలకు పంచకపోతే సిపిఐ ఆధ్వర్యంలో దశల వారి ఉద్యమాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు ఆందోళన ఉద్రిక్తత మధ్య సిపిఐ జిల్లా కార్యదర్శి బి విజయ సారధి లతో సహా 40 మంది సిపిఐ నేతల్ని అరెస్టు చేసి టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ ఆందోళనలో సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బి అజయ్ సారధి రెడ్డి, నన్ను సుధాకర్ రెడ్డి, కట్టబోయిన శ్రీనివాస్, నేతలు పెరుగు కుమార్, దేశపల్లి నవీన్, చింతకుంట్ల వెంకన్న, మామిళ్ల సాంబలక్ష్మి, కట్లోజు పాండురంగాచారి, వరిపల్లి వెంకన్న, నెల్లూరు నాగేశ్వరరావు,సందీప్, నరా శ్రావణ్, వెలుగు శ్రావణ్, మేక వీరన్న, తురక రమేష్, సమ్మయ్య, ఆబోతు అశోక్ మహమూద్ చిరంజీవి, పాల్  వెంకటరెడ్డి, చిర్ర సత్యనారాయణ,భూక్య హరి, అన్నం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన మార్కెఫెడ్ డీఎం
రామాయంపేట మండల కేంద్రంలోని మొక్కల కొనుగోలు కేంద్రాన్ని మార్ఫెడ్ డీఎం సునీత సందర్శించారు. కొనుగోలు...
By Katiyala JeevanRaj 2026-04-18 11:17:24 0 459
Andhra Pradesh
పుంగనూరు: కంటైనర్ డ్రైవర్ పై కేసు నమోదు
పుంగనూరు మండలం, సుగాలిమిట్ట మలుపు వద్ద శుక్రవారం రాత్రి కంటైనర్, లారీ ఢీకొన్న ఘటనలో రెండు వాహనాల...
By Kothuru Murali 2026-06-08 14:26:25 0 116
Telangana
బిజెపి అభ్యర్థి తో...బిఆర్ఎస్ కు ఓటువేయమంటున్న మాజీ మంత్రి
మహబూబాబాద్ జిల్లా, కొత్తగూడ, డిసెంబర్ 14(భారత్ ఆవాజ్): మండల కేంద్రంలో స్థానికల ఎన్నికల ప్రచార...
By Bheeshman King 2025-12-14 14:58:17 0 391
Andhra Pradesh
వేసవి సెలవులు: తిరుమలకు పోటెత్తిన భక్తులు.. కంపార్ట్‌మెంట్లు ఫుల్.
బుధవారం శ్రీవారిని దర్శించుకున్న 89,403 మంది భక్తులు హుండీ ద్వారా రూ. 4.99 కోట్ల ఆదాయం...
By Pagadala Venkateswar 2026-05-28 07:20:36 0 119
Andhra Pradesh
అన్నమయ్య జిల్లాలో చికెన్ కొంటున్నారా జాగ్రత్త
జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి పలు దుకాణాల్లో బ్రాయిలర్ కోడి కిలో 176 నుంచి 180 వరకు...
By Benguluri Madhubabu 2026-06-28 12:28:56 0 157
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com