ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చిత్రపటానికి పాలాభిషేకం

0
175

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చిత్రపటానికి పాలాభిషేకం

పెద్దారవీడు మండలం, సుంకేసుల గ్రామంలో వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల నిర్వాసితులకు రూ.300 కోట్ల ఆర్ & ఆర్ పరిహారం విడుదల చేసిన సందర్భంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చిత్రపటానికి గూడూరి ఎరిక్షన్ బాబు గారు, మహిళలు, కూటమి నాయకులు, నిర్వాసితులు, అభిమానులు ఘనంగా పాలాభిషేకం నిర్వహించారు.

ఈ సందర్భంగా యర్రగొండపాలెం నియోజకవర్గం టీడీపీ ఇంచార్జి శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారు మాట్లాడుతూ...

"వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇప్పటికే రూ.300 కోట్ల పరిహారాన్ని విడుదల చేసి నిర్వాసితుల పట్ల తమ చిత్తశుద్ధిని నిరూపించారు. మిగిలిన అర్హులైన లబ్ధిదారులకు కూడా వచ్చే జులై, ఆగస్టు నెలలలో మరో రూ.600 కోట్ల పరిహారం విడుదల చేసి, అందరికీ న్యాయం చేస్తామని ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చింది.

ప్రతి నిర్వాసిత కుటుంబం ప్రభుత్వం కేటాయించిన స్థలంలో సొంత ఇంటిని నిర్మించుకుని గౌరవప్రదమైన జీవితం ప్రారంభించుకోవాలని కోరారు. వెలిగొండ ప్రాజెక్టు పనులు వేగంగా కొనసాగుతున్నాయని, త్వరలోనే ప్రాజెక్టులో నీటి విడుదల జరిగి లక్షల ఎకరాలకు సాగునీరు ప్రజలకు త్రాగు నీరు అందే చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమవుతుందని తెలిపారు.

దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి రైతుల కలను సాకారం చేయడంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చారిత్రాత్మకమని, నిర్వాసితులకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం తప్పకుండా అమలు చేస్తుందని ఎరిక్షన్ బాబు గారు అన్నారు.

ఈ కార్యక్రమంలో పెద్దారవీడు మండల కూటమి నాయకులు, కార్యకర్తలు, సుంకేసుల గ్రామ నిర్వాసితులు, మహిళలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
Chandrababu: అమరావతి బిల్లుకు నేడు రాజ్యసభ ఆమోదం.. ఇది చారిత్రాత్మక దినం: ఎన్డీఏ నేతలతో సీఎం చంద్రబాబు.
ఏపీ రాజధాని అమరావతి విషయంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కాబోతోందని, మన రాష్ట్రానికి సంబంధించి ఈ రోజు...
By Pagadala Venkateswar 2026-04-02 05:56:38 0 279
Telangana
శ్రీ అయ్యప్ప స్వామి మహా పడిపూజ- పాల్గొన్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్.|
  మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ గురువారం నియోజకవర్గం...
By Sidhu Maroju 2025-12-25 10:02:08 0 240
Andhra Pradesh
మూడు రోజుల్లో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ పూర్తి చేయాలి: జేసీ
ఆగస్టు నెలకు సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీని మూడు రోజుల్లోగా పూర్తి చేయాలని JC సేధు...
By Boiena Rajesh 2026-08-04 23:39:33 0 143
Andhra Pradesh
నిమ్మనపల్లెలో చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి.
నిమ్మనపల్లి మండలంలో బుధవారం చేపల వేటకు వెళ్లిన వెంకటరమణ (45) అనే వ్యక్తి ప్రమాదవశాత్తూ చెరువులో...
By Pagadala Venkateswar 2026-05-20 13:50:44 0 128
Andhra Pradesh
పాత కక్షలు: వైసీపీ నేతపై కత్తితో దాడి, పలువురికి గాయాలు.
అన్నమయ్య జిల్లా మదనపల్లె మున్సిపాలిటీ సమీపంలో మంగళవారం రాత్రి పాత కక్షలతో ప్రసాద్ (41) అనే...
By Pagadala Venkateswar 2026-03-04 11:36:18 0 176
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com