Bharat Aawaz

ప్రేమ పేరుతో మైనర్‌కు వల..?

Sidhu Maroju
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
2 min read
0
Comments
146
Views

"మైనర్ బాలికకు సంబంధించిన ఫిర్యాదుతో ఆల్వాల్ పోలీసుల కేసు నమోదు"

మల్కాజిగిరి జిల్లా : ఆల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికతో అనుచితంగా వ్యవహరించిన ఘటనలో ఓ యువకుడిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

పోలీసుల వివరాల ప్రకారం, జూన్ 26న ఓ మహిళ తన 17 ఏళ్ల కుమార్తెకు సంబంధించిన ఫిర్యాదుతో ఆల్వాల్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించింది.

ఫిర్యాదు మేరకు, మహ్మద్ అర్ఫోజ్ (28) అనే వ్యక్తి సుమారు మూడు సంవత్సరాల క్రితం సోషల్ మీడియా ద్వారా మైనర్ బాలికతో పరిచయం పెంచుకుని, ప్రేమ పేరుతో ఆమెను ప్రభావితం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో బాలిక తన కుటుంబానికి దూరమయ్యే పరిస్థితి ఏర్పడిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.

జూన్ 26న ఓల్డ్ ఆల్వాల్‌లోని బతుకమ్మ పార్క్‌లో నిందితుడితో కలిసి ఉన్న బాలికను ఆమె తల్లి గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. 

ఫిర్యాదు ఆధారంగా ఆల్వాల్ పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 75తో పాటు పోక్సో చట్టంలోని సెక్షన్లు 11, 12 కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.

#Sidhumaroju

Alwal