నిజామాబాద్: ఎస్ఐఆర్ సర్వేలో ప్రతి ఓటరు తప్పనిసరిగా పాల్గొనాలి – మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల

0
169

నిజామాబాద్.ఎస్ఐఆర్ (Special Intensive Revision) సర్వేలో భాగంగా మొదటి రోజు సంబంధిత బీఎల్ఓల నుంచి ఎన్యూమరేషన్ పత్రాలను స్వీకరించడం జరిగిందని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఓటరు జాబితా పారదర్శకంగా, తప్పులు లేకుండా రూపొందించేందుకు ఎన్నికల సంఘం చేపట్టిన ఈ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రతి అర్హత కలిగిన ఓటరు తమకు అందిన ఎన్యూమరేషన్ పత్రాన్ని పూర్తిగా, సరైన వివరాలతో నింపి, అవసరమైన ధ్రువపత్రాలను జతచేసి, నిర్ణీత గడువులోగా సంబంధిత బీఎల్ఓ లేదా ఎన్నికల అధికారులకు అందజేయాలని కోరారు.ఓటు హక్కు ప్రతి భారత పౌరుడికి రాజ్యాంగం కల్పించిన అత్యంత విలువైన హక్కు అని, చిన్న నిర్లక్ష్యం వల్ల భవిష్యత్తులో ఓటు నమోదు, సవరణ లేదా ఇతర సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. అందువల్ల ప్రతి కుటుంబం ఈ ప్రక్రియను సీరియస్‌గా తీసుకుని, ఇంట్లోని ప్రతి అర్హత కలిగిన ఓటరికి సంబంధించిన వివరాలను సక్రమంగా నమోదు చేయించాలని సూచించారు.నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ ప్రజలందరూ ఎన్నికల సంఘానికి సహకరిస్తూ ఈ సర్వేను విజయవంతం చేయాలని, అలాగే తమ బంధువులు, స్నేహితులు, పొరుగువారిలో కూడా అవగాహన కల్పించి ప్రతి ఒక్కరూ ఎన్యూమరేషన్ పత్రాన్ని తప్పనిసరిగా సమర్పించేలా సహకరించాలని మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల విజ్ఞప్తి చేశారు.

*"మన ఓటు – మన హక్కు... మన బాధ్యత. ప్రతి ఓటరిని రక్షించుకుందాం... ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దాం."*

Search
Categories
Read More
Andhra Pradesh
నాలుగు స్తంభాల వద్ద ఏడు లక్షల వ్యయంతో మెట్లు డ్రైన్ల నిర్మాణం
*నాలుగు స్తంభాల వద్ద 7 లక్షల వ్యయంతో మెట్లు,డ్రెయిన్ల నిర్మాణం*   *44వ డివిజన్ కార్పొరేటర్...
By Rajini Kumari 2026-03-09 17:28:07 0 211
Jharkhand
Jharkhand Strengthens Water Conservation and Irrigation
Jharkhand continues to enhance water conservation and irrigation through watershed development,...
By Fathima Safa 2026-07-03 15:26:39 0 71
Telangana
"కాంగ్రెస్‌పై బీజేపీ ఆరోపణల సమరం".|
● కాంగ్రెస్ వైఖరిని నిరసిస్తూ మీ సేవా కేంద్రం వద్ద ధర్నా. ● దేశ సమగ్రత, జాతీయ భద్రత అంశాలపై...
By Sidhu Maroju 2026-07-23 19:09:28 0 298
Telangana
" ప్రజావాణిలో ప్రజా సమస్యలపై శాంతి శ్రీనివాస్ రెడ్డి చర్చ.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :ఆల్వాల్  మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి సాజిద్,...
By Sidhu Maroju 2026-04-13 09:18:00 0 311
Telangana
షార్ట్ సర్క్యూట్ లో ఇల్లు ధ్వంసం... దుగ్గండి మండలంలో
దుగ్గొండి: షార్ట్ సర్క్యూట్తో ఇల్లు దగ్ధం భారత్ అవాజ్ న్యూస్: 22 జూన్ రోజున వరంగల్ జిల్లా...
By Gujile Ramu 2026-06-22 06:37:38 0 221
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com