ప్రతి ఏటా లాగే.. ఈసారి కూడా దీక్ష చేపట్టిన పవన్.

0
80

మంగళగిరిలో వార్షిక ఆధ్యాత్మిక దీక్షను ప్రారంభించిన పవన్ కల్యాణ్ 

పానకాల లక్ష్మీనరసింహస్వామికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు

ప్రతి ఏటా నాలుగు నెలల పాటు ఈ దీక్షను పాటిస్తున్న పవన్

డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తూనే దీక్ష స్వీకరణ

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తన వార్షిక ఆధ్యాత్మిక దీక్షను ప్రారంభించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని శ్రీ పానకాల లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నిన్న ఆయన శాస్త్రోక్తంగా ఈ దీక్షను స్వీకరించారు.

 

దీక్షా స్వీకరణకు ముందు పవన్ కల్యాణ్ ఆలయంలో ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించి, అష్టోత్తర శతనామావళి పూజ జరిపించారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు రాజగోపురం వద్ద ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈవో) సునీల్ కుమార్, అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు.

 

పవన్ కల్యాణ్ ప్రతి ఏటా నాలుగు నెలల పాటు ఈ దీక్షను పాటిస్తుంటారు. తన గురువు నుంచి మంత్రోపదేశం పొందిన నాటి నుంచి ఆధ్యాత్మిక క్రమశిక్షణలో భాగంగా ఈ నియమాన్ని ఆయన అనుసరిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రిగా, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తూనే ఆయన తన ఆధ్యాత్మిక నియమాలను కొనసాగిస్తున్నారు.

 

ఈ కార్యక్రమంలో ఏపీఎంఎస్‌ఐడీసీ ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావుతో పాటు పలువురు నేతలు, జనసేన నాయకులు పాల్గొన్నారు. 

Search
Categories
Read More
Andhra Pradesh
అయోధ్య రామయ్య చెంతన సీఎం చంద్రబాబు నాయుడు గారు
 అయోధ్య రామాలయంలో శ్రీ రాముడుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ముఖ్యమంత్రి...
By Rajini Kumari 2025-12-28 10:09:17 0 201
Andhra Pradesh
పుంగనూరు: శనేశ్వర స్వామి జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు
శనివారం, పుంగనూరు పట్టణ సమీపంలోని యాభై రాళ్ల మొరవ వద్ద వెలసిన శనేశ్వర స్వామి ఆలయంలో శనేశ్వర...
By Kothuru Murali 2026-05-16 15:57:46 0 112
Telangana
బడి ఈడు పిల్లలను బడిలో చేర్పించాలి
చిలుకూరు మండల పరిధిలో ని బడి ఈడు పిల్లలను, బడిలో చేర్పించాలని, బడిబాట కార్యక్రమం ను చిలుకూరు...
By Nookapangu Manikanta 2026-05-14 06:03:07 0 330
Telangana
కొత్త రకం దొంగతనాలు :ముగ్గురిని కటకటాల్లోకి నెట్టిన బోయిన్ పల్లి పోలీస్ లు
సికింద్రాబాద్.. ద్విచక్ర వాహనంపై వెళ్తూ సొమ్మసిల్లి రహదారిపై కుప్పకూలినట్లు నటిస్తారు.వెంటనే...
By Sidhu Maroju 2025-06-17 10:46:20 0 2K
Lakshdweep
Lakshadweep Strengthens Water Resource Management
Lakshadweep continues to enhance water resource management by promoting sustainable freshwater...
By Fathima Safa 2026-06-29 08:11:56 0 98
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com