కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా లైబ్రరీ చైర్మన్ అనిల్ కుమార్ చేతుల మీదుగా మోడల్ స్కూల్ విద్యార్థులకు పుస్తకాల పంపిణీ

1
235

🎤కొమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్ 

ఆసిఫాబాద్: కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఉచిత పుస్తకాలు మరియు నోట్ బుక్స్ పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గ్రంథాలయం చైర్మన్ కామ్లే అనిల్ కుమార్ విద్యార్థులకు స్వయంగా పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రజా పాలన ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి సహకారంతో అందిస్తున్న పుస్తకాలు, మధ్యాహ్నం భోజనం, స్టూడెంట్ కిట్స్ విద్యార్థులకు ఎంతో ఉపయోగపడతాయన్నారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వ పాఠశాలల్లో మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ ఉదయపు అల్పాహారం కూడా అందిస్తామని గుర్తు చేశారు. ప్రభుత్వం ఎల్లప్పుడూ పేద, మధ్యతరగతి విద్యార్థులకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తెలంగాణ నిర్మాణం విద్యార్థుల చేతుల్లోనే ఉందని, ప్రతి ఒక్కరూ ఉన్నత స్థాయిలో చదువుకుని ఉన్నత పదవులు చేపట్టాలని, చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని విద్యార్థులకు సూచించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు దుర్గం మహేష్, ఆసిఫాబాద్ కౌన్సిలర్ రాపర్తి కార్తీక్, విద్యార్థి నాయకులు రాజేందర్, NSUI నాయకులు జమీర్, ఉపసర్పంచ్ జీవన్ తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
RCM చర్చ్ సందర్శించినMP కేశినేని శివనాద్
*ప్ర‌చుర‌ణార్థం* *29-12-2025*    ఆర్.సి.ఎమ్ చ‌ర్చ్ ను...
By Rajini Kumari 2025-12-29 13:25:21 0 225
Madhya Pradesh
VB-G RAM G Act: Boost to Rural Employment Starts Today
The 'Vikshit Bharat - Guarantee for Rozgar and Aajivika Mission (Gramin)' (VB-G RAM G) Act has...
By Lokeshwari Panthadi 2026-07-01 07:01:05 0 100
Andhra Pradesh
మదనపల్లి: రిటైర్డ్ పోలీసు అధికారులకు ఎస్పీ ఘన వీడ్కోలు.
అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్, మంగళవారం మాట్లాడుతూ, అన్నమయ్య పోలీస్ శాఖలో సుదీర్ఘ సేవలు అందించి...
By Pagadala Venkateswar 2026-07-01 06:52:06 0 116
Andhra Pradesh
వృద్ధాశ్రమానికి ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ భారీ విరాళం – రూ.50 లక్షల మంజూరు
కాకినాడ ఎంపీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ సామాజిక సేవలో మరో ముందడుగు వేశారు. పెద్దాపురం మహారాణి కళాశాల...
By Ratna Sekhar 2026-02-19 19:13:06 0 1K
Andhra Pradesh
35వ వార్డు సచివాలయంలో ప్రజా సమస్యలపై వేగవంతమైన చర్యలు.
అన్నమయ్య జిల్లా మదనపల్లె 35వ వార్డు సచివాలయంలో గురువారం ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు...
By Pagadala Venkateswar 2026-05-01 04:07:12 0 181
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com