ఏసీబీ వలలో మరో పెద్ద చేప.. నిజామాబాద్ ఎక్సైజ్ అధికారిపై దాడులు.|

2
384

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టిన ఆరోపణల నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కొమ్మూరి మల్లారెడ్డిపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మంగళవారం విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహించారు. 

అక్రమ మార్గాల్లో తెలిసిన ఆదాయ వనరులను మించి ఆస్తులు సమకూర్చుకున్నారనే అభియోగాలపై అవినీతి నిరోధక చట్టం-1988 (2018 సవరణలతో)లోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన అధికారులు, హైదరాబాద్‌లోని అల్వాల్ సూర్యనగర్ నివాసంతో పాటు నిజామాబాద్‌లోని అద్దె ఇంటి సహా కుటుంబ సభ్యులు, బినామీలు, సన్నిహితులకు సంబంధించిన మొత్తం 11 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టారు.

తనిఖీల సందర్భంగా నాలుగు నివాస గృహాలు, ఒక వాణిజ్య భవనం, ఎనిమిది ఖాళీ స్థలాలు, 10.23 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు గుర్తించారు. 

అలాగే సుమారు రూ.3.31 లక్షల నగదు, రూ.50 లక్షల మేర బ్యాంకు డిపాజిట్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మల్లారెడ్డి భార్యతో పాటు కుటుంబ సభ్యుల పేర్లపై ఉన్న మూడు బ్యాంకు లాకర్లను కూడా గుర్తించగా, వాటిని త్వరలో తెరిచి పరిశీలించనున్నట్లు సమాచారం.

అదేవిధంగా ఒక గ్రాండ్ విటారా కారు, ఒక టీవీఎస్ స్కూటీని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు వెలుగులోకి వచ్చిన ఆస్తుల విలువ సుమారు రూ.3 కోట్లుగా అంచనా వేస్తున్నప్పటికీ, ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం వాటి విలువ మరింత ఎక్కువగా ఉండే అవకాశముందని ఏసీబీ వర్గాలు పేర్కొన్నాయి. 

మరికొన్ని ఆస్తులకు సంబంధించిన వివరాల సేకరణ కొనసాగుతోందని, దర్యాప్తు పూర్తయ్యే వరకు మరిన్ని అంశాలు బయటపడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

సోదాల అనంతరం మల్లారెడ్డిని నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించనున్నట్లు వెల్లడించారు. 

ఇదిలా ఉండగా, ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా లంచం డిమాండ్ చేసినట్లయితే ప్రజలు ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064కు లేదా ఇతర అధికారిక మాధ్యమాల ద్వారా ఫిర్యాదు చేయాలని శాఖ సూచించింది.

#,Sidhumaroju

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
చిల్లకల్లు గ్రామంలో గోపయ్య సమేత శ్రీ తిరుపతమ్మ రంగుల మహోత్సవం
జగ్గయ్యపేట    కన్నుల పండువగా శ్రీ గోపయ్య సమేత శ్రీ తిరుపతమ్మ అమ్మవారు రంగుల మహోత్సవ...
By Rajini Kumari 2026-01-06 10:58:42 0 248
Andhra Pradesh
మదనపల్లెలో మురికి కాలువలు, రోడ్ల శుభ్రత: ఎమ్మెల్యే ఆదేశాలు.
అన్నమయ్య జిల్లా మదనపల్లెలోని 18వ వార్డులో, ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆదేశాల మేరకు ఇంచార్జ్ సయ్యద్...
By Pagadala Venkateswar 2026-04-03 06:00:42 0 242
Telangana
గొర్రెను కాపాడబోయి మృత్యువు బడిలోకి....!
బావిలో పడి బాలుడు మృతి.. రంగాపురంలో ఘటన.... భారత్ అవాజ్ న్యూస్: 15 మే నేడు సాయంత్రం ఖానాపురం...
By Gujile Ramu 2026-05-15 06:18:04 0 152
SURAKSHA
Shri Ronald Rose, IAS: Champion of People-Centric Governance
From Grassroots Governance to Citizen-Centric Administration—An IAS Officer Dedicated to...
By Lokeshwari Panthadi 2026-07-09 09:17:21 0 193
Andhra Pradesh
GDCC బ్యాంక్, నల్లపాడు బ్రాంచ్ నందు నిధుల దుర్వినియోగం కేసులో మరో నిందితుడిని అరెస్ట్ చేసిన గుంటూరు జిల్లా CCS పోలీసులు.
📍గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, CCS డీఎస్పీ శ్రీ బి.వి....
By John Baji 2026-02-04 08:35:36 0 398
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com