ఇంజెక్షన్‌తోనే పిల్లలు పుడతారట.. నమ్మి వెళ్లిన ఆ దంపతులు.. చివరకు..

0
161

హైదరాబాద్‌లో సంతానం కోసం ఎదురుచూస్తున్న దంపతులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న నకిలీ వైద్యుడి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కుత్బుల్లాపూర్‌కు చెందిన పెంటయ్య అనే వ్యక్తి తనను ఎంబీబీఎస్ వైద్యుడిగా పరిచయం చేసుకుంటూ, ప్రత్యేక ఇంజక్షన్లు ఇస్తే తప్పకుండా సంతానం కలుగుతుందని నమ్మబలికినట్లు పోలీసులు తెలిపారు. ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన కుత్బుల్లాపూర్ SOT పోలీసులు అతడికి ఎలాంటి వైద్య అర్హతలు లేవని గుర్తించి అరెస్ట్ చేశారు.

‎హైదరాబాద్‌లో మరో షాకింగ్ ఘటన వెలుగు చూసింది.. సంతానం కోసం ఎదురుచూస్తున్న దంపతుల ఆశలను ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న నకిలీ వైద్యుల వ్యవహారం సంచలనంగా మారింది.. సంతానం కలిగేలా ప్రత్యేక ఇంజక్షన్లు ఇస్తానంటూ ప్రజలను నమ్మించి డబ్బులు వసూలు చేస్తున్న ఓ నకిలీ డాక్టర్‌ను మేడ్చల్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం, కుత్బుల్లాపూర్ ప్రాంతానికి చెందిన పెంటయ్య అనే వ్యక్తి ఎంబీబీఎస్ డాక్టర్‌గా తనను తాను పరిచయం

‎చేసుకుంటూ ప్రజలను మభ్యపెట్టేవాడు. సంతానం లేని దంపతులకు ప్రత్యేక చికిత్స అందిస్తానని, ఇంజక్షన్లు వేస్తే తప్పకుండా సంతానం కలుగుతుందని ప్రచారం చేసేవాడు. ఈ నమ్మకంతో పలువురు అతని వద్దకు వెళ్లి చికిత్స పొందినట్లు తెలుస్తోంది. అయితే పెంటయ్యకు వైద్య అర్హతలు లేవని, అతను నిర్వహిస్తున్న వైద్య సేవలు పూర్తిగా అక్రమమని అధికారుల విచారణలో తేలింది. దీనిపై అందిన ఫిర్యాదు మేరకు కుత్బుల్లాపూర్ SOT పోలీసులు దర్యాప్తు చేపట్టి అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్ విధించింది.సంతానం కోసం సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న దంపతులు భావోద్వేగపరంగా బలహీనంగా ఉంటారు. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని కొందరు నకిలీ వైద్యులు, మంత్రగాళ్లు, బాబాలు మోసాలకు పాల్పడుతున్నారని.. అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. శాస్త్రీయ ఆధారాలు లేని చికిత్సలు ఆరోగ్యానికి హానికరమయ్యే ప్రమాదం ఉందని సూచిస్తున్నారు. ప్రజలు వైద్య సేవలు పొందే ముందు సంబంధిత వైద్యుడి అర్హతలు, ఆసుపత్రి అనుమతులు తప్పనిసరిగా పరిశీలించాలని అధికారులు సూచిస్తున్నారు.

‎అనుమానాస్పద వైద్య కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారు కనిపిస్తే వెంటనే పోలీసులకు లేదా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సమాచారం అందించాలని కోరుతున్నారు. సంతానం కోసం ఎదురుచూస్తున్న వారి ఆశలను వ్యాపారంగా మార్చుకునే నకిలీ వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Search
Categories
Read More
West Bengal
NCPI Rises as 20 Rebel TMC MPs Shift Bengal Allegiance
An unprecedented political shakeup has upended West Bengal following the aftermath of the state...
By Lokeshwari Panthadi 2026-06-25 12:15:22 0 92
SURAKSHA
Deepak Kumar, IAS: Architect of Uttar Pradesh's Progress
A distinguished 1990-batch Uttar Pradesh Cadre IAS officer, Shri Deepak Kumar is serving as...
By Lokeshwari Panthadi 2026-07-31 07:20:00 0 196
Telangana
"తుర్కపల్లి - మచ్చబొల్లారంలో కాంగ్రెస్ జోష్.. కొత్త కమిటీలతో పార్టీకి కొత్త ఊపు.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతానికి మరో అడుగు పడింది.  190...
By Sidhu Maroju 2026-05-23 18:45:04 0 285
Andhra Pradesh
నిమ్మనపల్లి: ట్రాక్టర్ ప్రమాదంలో రైతుకు తీవ్ర గాయాలు.
గురువారం నిమ్మనపల్లి మండలంలో ట్రాక్టర్ ప్రమాదంలో ముస్తూరుకు చెందిన రైతు మస్తాన్ తీవ్రంగా...
By Pagadala Venkateswar 2026-06-26 03:15:16 0 143
Telangana
బీజేపీ సింగరేణి భరోసా కార్యక్రమన్ని అడ్డుకున్న పోలీసులు
మంచిర్యాల జిల్లా :  సింగరేణి లో జరుగుతున్న అవకతవకల పై సింగరేణి భరోసా కార్యక్రమంలో భాగంగా...
By Avunoori Mahesh 2026-06-19 11:56:35 0 246
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com