International Olympics day

0
178

🏅ప్రపంచంలోనే అతి పెద్ద క్రీడా మహోత్సవమైన ఒలింపిక్స్‌కు ప్రతీకగా నిర్వహించే అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవం సందర్భంగా క్రీడాకారులు, క్రీడాభిమానులకు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు శుభాకాంక్షలు తెలిపారు. ఈ దినోత్సవాన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రపంచ వ్యాప్తంగా క్రీడాకారుల మధ్య ఐక్యత, శాంతి, సౌభ్రాతృత్వ భావాలను మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు.  

 

🏅క్రీడా నైపుణ్యాలను ప్రోత్సహించడంతో పాటు ఈ దినోత్సవం సందర్భంగా లింగ, వయసు, సామర్థ్యాల పరంగా ఎలాంటి వివక్ష లేకుండా క్రీడా రంగంలో సమాన అవకాశాలు కల్పించే వాతావరణం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ముఖ్యమంత్రి గారు పిలుపునిచ్చారు. 

 

🏅కృషి, పట్టుదల, క్రమశిక్షణ, ఐక్యత, శాంతికి ప్రతీకగా నిలుస్తున్న ఈరోజున క్రీడాకారులు తమ లక్ష్యాల సాధన కోసం నిరంతరం శ్రమిస్తూ ముందుకు సాగాలని సూచించారు. అలుపెరగని ప్రయత్నమే నిజమైన విజయానికి నాంది పలుకుతుందని, క్రీడారంగంలో ఎదురయ్యే ప్రతి సవాలును ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో అధిగమిస్తూ, ఉన్నత లక్ష్యాల వైపు అడుగులు వేయడానికి అంతర్జాతీయ ఒలింపిక్స్ దినోత్సవం ప్రేరణగా నిలవాలని ఆకాంక్షించారు.

Search
Categories
Read More
Telangana
పిల్లలను ప్రైవేట్ స్కూళ్లకు పంపకండి: సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy 
By Sunka Santhosh 2026-03-23 11:02:46 0 336
Andhra Pradesh
పుంగనూరు: పుంగునూరు ప్రముఖ పుణ్యక్షేత్రం బోయ కొండలో క్యూఆర్ కోడ్ స్కానర్లు
పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలంలోని శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో మంగళవారం మధ్యాహ్నం ఆలయ ఉప...
By Kothuru Murali 2026-02-11 08:42:59 0 186
Andhra Pradesh
పుంగనూరు చిత్తూరు జిల్లా కి బాయ్ బాయ్ అన్నమయ్య జిల్లా కు వెల్కం
చిత్తూరు జిల్లాతో ఉన్న సంబంధాన్ని తెంచుకుని, పుంగనూరు బుధవారం కొత్తగా ఏర్పడిన అన్నమయ్య జిల్లాలో...
By Kothuru Murali 2026-01-01 12:25:40 0 223
Telangana
సైబర్ మోసాల పై జర జాగ్రత్త : ఎస్ హెచ్ ఓ సుధీర్ కృష్ణ .|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : ప్రజలు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని...
By Sidhu Maroju 2026-03-04 15:06:24 0 196
BMA
Allahabad HC Protects Journalist Exposing School Plight
The Allahabad High Court stayed an FIR against journalist Amit Yadav, who was booked under severe...
By JoinBMA 2026-09-11 06:41:58 0 121
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com