International Olympics day

0
179

🏅ప్రపంచంలోనే అతి పెద్ద క్రీడా మహోత్సవమైన ఒలింపిక్స్‌కు ప్రతీకగా నిర్వహించే అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవం సందర్భంగా క్రీడాకారులు, క్రీడాభిమానులకు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు శుభాకాంక్షలు తెలిపారు. ఈ దినోత్సవాన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రపంచ వ్యాప్తంగా క్రీడాకారుల మధ్య ఐక్యత, శాంతి, సౌభ్రాతృత్వ భావాలను మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు.  

 

🏅క్రీడా నైపుణ్యాలను ప్రోత్సహించడంతో పాటు ఈ దినోత్సవం సందర్భంగా లింగ, వయసు, సామర్థ్యాల పరంగా ఎలాంటి వివక్ష లేకుండా క్రీడా రంగంలో సమాన అవకాశాలు కల్పించే వాతావరణం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ముఖ్యమంత్రి గారు పిలుపునిచ్చారు. 

 

🏅కృషి, పట్టుదల, క్రమశిక్షణ, ఐక్యత, శాంతికి ప్రతీకగా నిలుస్తున్న ఈరోజున క్రీడాకారులు తమ లక్ష్యాల సాధన కోసం నిరంతరం శ్రమిస్తూ ముందుకు సాగాలని సూచించారు. అలుపెరగని ప్రయత్నమే నిజమైన విజయానికి నాంది పలుకుతుందని, క్రీడారంగంలో ఎదురయ్యే ప్రతి సవాలును ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో అధిగమిస్తూ, ఉన్నత లక్ష్యాల వైపు అడుగులు వేయడానికి అంతర్జాతీయ ఒలింపిక్స్ దినోత్సవం ప్రేరణగా నిలవాలని ఆకాంక్షించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
కల్లూరు లో ఘనంగా నిర్వహించిన హిందూ సమ్మేళనం
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘం వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, శుక్రవారం పుంగనూరు...
By Kothuru Murali 2026-01-09 12:36:06 0 202
Sports
హైదరాబాద్ లో రగ్బీ ప్రీమియర్ లీగ్ పోటీల నిర్వహణ
భారతదేశంలో రగ్బీ ప్రీమియర్ లీగ్ (RPL) రెండవ ఎడిషన్ 2026, జూన్ 16 నుండి జూన్ 28...
By Avunoori Mahesh 2026-04-18 17:07:02 0 243
Andhra Pradesh
నేడు ఏపీలో వానలు.. ఏయే జిల్లాల్లో అంటే?
ఆంధ్రప్రదేశ్‌లో గురువారం పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ...
By Pagadala Venkateswar 2026-08-06 06:38:26 0 99
Andhra Pradesh
Rayalaseema Lift Irrigation Scheme: జగన్ చేతకానితనం వల్లే సీమ లిఫ్ట్ ఆగింది: టీడీపీ మంత్రుల ధ్వజం.
రాయలసీమ ఎత్తిపోతల పథకంపై శాసనమండలిలో తీవ్ర వాగ్వాదం వైసీపీ హయాంలోనే పనులు ఆగిపోయాయని మంత్రులు...
By Pagadala Venkateswar 2026-02-26 11:34:56 0 180
Andhra Pradesh
ప్రగతి పథంలో పార్నపల్లె గ్రామం
ప్రగతి పథంలో పార్నపల్లె గ్రామం. బండి ఆత్మకూరు మండలం పార్నపల్లె గ్రామంలో రూ.50 లక్షల వ్యయంతో...
By Chennaiah Kati 2026-06-28 06:42:12 0 112
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com