డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు.|

0
179

హైదరాబాద్ : భారతీయ జనతా పార్టీ సిద్ధాంతకర్త, జాతీయవాది నాయకుడు డాక్టర్ శ్యామ్  ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు ఘన నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాయకులు డాక్టర్ శ్యామ్  ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఆయన దేశానికి అందించిన సేవలను స్మరించుకున్నారు. జాతీయ ఐక్యతకు, భారత సమగ్రతకు ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. దేశభక్తి, నిస్వార్థ సేవాభావానికి ప్రతీకగా నిలిచిన మహానేతగా ఆయనను కొనియాడారు.

భారత మాత గొప్ప కుమారుడైన డాక్టర్ శ్యామ్  ప్రసాద్ ముఖర్జీ ఆశయాలు నేటి తరాలకు స్ఫూర్తిదాయకమని నాయకులు అభిప్రాయపడ్డారు. దేశ సమగ్రత, జాతీయవాద విలువల పరిరక్షణ కోసం ఆయన చేసిన త్యాగాలు ఎప్పటికీ మరువలేనివని పేర్కొంటూ వినమ్ర నివాళులు  అర్పించారు.

#Sidhumaroju

Search
Categories
Read More
Telangana
బీజేపీ సింగరేణి భరోసా కార్యక్రమన్ని అడ్డుకున్న పోలీసులు
మంచిర్యాల జిల్లా :  సింగరేణి లో జరుగుతున్న అవకతవకల పై సింగరేణి భరోసా కార్యక్రమంలో భాగంగా...
By Avunoori Mahesh 2026-06-19 11:56:35 0 245
Telangana
సార్
కొడంగల్ లో ని తన స్వగృహంలో సార్ ప్రక్రియలో పాల్గొని ఏంయుమరేషన్ ఫామ్ ను బిఎల్ ఓ కు అందజేసిన...
By Vanmoj Suryamohan 2026-07-22 05:32:24 0 192
Telangana
బొగ్గు మాయం అయ్యింది అంటే ఎవరూ సప్పుడు చేయడం లేదు...మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు
భూపాలపల్లికి మేం వెళ్లి బొగ్గును చూస్తాం అంటే.. మైన్ సేఫ్టీ అంటూ మమ్మల్ని అడ్డుకున్నరు....
By Ponnala Srinivasrao 2026-06-13 05:45:04 0 178
Andhra Pradesh
చంద్రబాబు ఫోన్‌కు కేంద్రమంత్రి ఫిదా.. ఫోన్ ఫీచర్లు అడిగి తెలుసుకున్న అశ్వినీ వైష్ణవ్.. విశాఖ సభలో ఆసక్తికర ఘటన!
Andhra Union Minister Ashwini Vaishnaw Asks CM Chandrababu Mobile Details విశాఖలో గూగుల్ క్లౌడ్...
By Pagadala Venkateswar 2026-04-29 05:28:20 0 146
Telangana
"తుర్కపల్లి - మచ్చబొల్లారంలో కాంగ్రెస్ జోష్.. కొత్త కమిటీలతో పార్టీకి కొత్త ఊపు.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతానికి మరో అడుగు పడింది.  190...
By Sidhu Maroju 2026-05-23 18:45:04 0 281
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com