ప్రజా ప్రతినిధుల అక్రమాలపై మాజీ ఎంపీ భరత్ ధ్వజం

0
358

ప్రభుత్వ అన్యాయాలపై , ప్రజా ప్రతినిధుల అక్రమాలపై మాజీ ఎంపీ భరత్ ధ్వజం..

 

జిల్లా కలెక్టరేట్ పీజీఆర్ఎస్ లో చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు..కల్తీ పాల ఘటనలో బాధిత బాలల చికిత్సను పట్టించుకోని ప్రభుత్వం..పార్టీ బీసీ నాయకుడి పీతా రామకృష్ణ అరెస్టు రెడ్ బుక్ రాజ్యాంగమే, గామన్ బ్రిడ్జి భద్రతకు ప్రమాదకరంగా ఇసుక దోపిడీ, ముస్లిం షాదీఖానా ను అడ్డుకున్న ఈవీఎం ఎమ్మెల్యే 

 

రాజమహేంద్రవరం..

 

రాష్ట్రంలో మంత్రి లోకేష్ రెడ్ బుక్కు రాజ్యాంగం అమలవుతుందని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం తుంగలో తొక్కుతోందని, ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయిస్తు వేధిస్తున్నారని వైయస్ఆర్ సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ ప్రభుత్వ వైఫల్యం పై ద్వజమెత్తారు. ప్రభుత్వ అన్యాయాలపై , అక్రమాలపై, స్థానిక ప్రజాప్రతినిధుల అక్రమాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం జిల్లా కలెక్టరేట్లో పి పీజీఆర్ఎస్ లో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మాజీ ఎంపీ భరత్ రామ్ జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేశారు. 

 

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నగరంలో జరిగిన కల్తీ పాల ఘటనలో బాల, బాలికలకు మెరుగైన, ఆధునిక వైద్య చికిత్సలు అందక మృత్యు ఒడిలోకి జారుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సంఘటన జరిగినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా ప్రభుత్వ పెద్దలు బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తామని అసెంబ్లీలో ప్రకటించారని, ఈరోజు వరకు సరైన వైద్యం అందించడం లేదని బాలల బాధితుల కుటుంబాలు పిల్లలను రక్షించుకోలేక ఆర్థికంగా సతమతమవుతున్నాయని, ప్రభుత్వం హామీని నిలబెట్టుకోలేకపోవడం దారుణం అన్నారు. బాలల కుటుంబాలకు ఇప్పటివరకు మూడున్నర లక్షల రూపాయలు ఖర్చయిందని ఇంతవరకు ప్రభుత్వం రీయింబర్స్మెంట్ కూడా చేయలేదని, వైద్యం చేస్తున్న ప్రైవేటు ఆసుపత్రి యాజమాన్యాలు కూడా బెదిరిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో జిల్లా కలెక్టర్ స్పందించాలన్నారు. 

 

రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారమే పీతారామకృష్ణ అక్రమ అరెస్టు..రాష్ట్రంలోనూ , రాజమండ్రిలోను రాజ్యాంగం నడవడం లేదని లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని, తమ పార్టీ లో క్రియాశీలకంగా ఉండే బీసీ నాయకుడు పీతారామకృష్ణ పై అక్రమంగా పీడీ చట్టం ప్రయోగించారని భరత్ మండిపడ్డారు. ఇదంతా ఈవీఎం ఎమ్మెల్యే కుట్రలో భాగమేనని, అతని ఒత్తిడి మేరకు పోలీసులు

నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. నగర టీడీపీలో 40 వ వార్డు పరిసరాల్లో రెండు గ్రూపులు కొట్టుకున్నాయని, కొట్టిన వారు పెట్టిన కేసును పోలీసులు నమోదు చేశారని దెబ్బలు తిన్న వారిని అరెస్టు చేశారని భరత్ విమర్శించారు. ఇదేంటి అన్యాయమని అడిగినా పీతా రామకృష్ణను గతంలో కొట్టేసిన కేసులను అడ్డం పెట్టుకొని పీడీ యాక్ట్ అమలు చేయడం దారుణం అన్నారు. కోర్టుకు వెళ్లి రౌడీ షీట్ పై స్టే ఆర్డర్ తెచ్చుకున్నారని అయినప్పటికీ పోలీస్ లు అరెస్టు చేయడం ఈవీఎం ఎమ్మెల్యే కక్ష సాధింపు చర్యలని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నించడమే ప్రధాన బాధ్యతని ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయించడం ప్రభుత్వ నియంతృత్వ ధోరణి కి నిదర్శనం అన్నారు దీనిపై జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించారని ఆన్నారు.

 

ప్రజల సహకారస్ఫూర్తిని దెబ్బతీస్తున్న ఇన్నీస్ పేట కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ తీరు..ప్రజల సహకార స్ఫూర్తికి, ప్రజల ఆర్థిక భద్రతకు, అభివృద్ధికి తోడ్పడవలసిన ఇన్నిస్పేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు చైర్మన్ కోళ్ల బాబు తీరు ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా ఉందని భరత్ విమర్శించారు. కోఆపరేటివ్ బ్యాంకు 1964 చట్టం నుండి ఏకపక్ష, శాశ్వత చైర్మన్ పదవి కి దారి తీసే 1995 మ్యాక్ చట్టం పరిధిలోకి బలవంతంగా ప్రజలను, సభ్యులను ఒప్పించేలాగా కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. ఈ మార్పు ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధమని, కోళ్ల బాబు అనే వ్యక్తి ఇప్పటికే గత 20 సంవత్సరాలుగా బ్యాంకును పట్టుకొని వేలాడుతున్నాడని ఇతని చర్యలు వెనుక ఈవీఎం ఎమ్మెల్యే కులాభిమానం ఉందని ఆరోపించారు. ఆర్యపురం బ్యాంకు ను మరొక ఈవీఎం ఎమ్మెల్యే అనుచరుడు పాలిస్తున్నాడని, నగరంలోని కోఆపరేటివ్ బ్యాంకులను తమ ఆస్తులుగా పంచేసుకున్నారని విమర్శించారు. ఆర్బీఐ నిబంధనల ప్రాకారం ఏ సభ్యుడైనా, ఏ డైరెక్టర్ అయినా 8 లేదా 10 సంవత్సరాల మించి ఉండకూడదని స్పష్టంగా ఉందని ఈ నిబంధనలను మ్యాక్ చట్టంను అడ్డం పెట్టుకొని కోళ్ల బాబు ముఠా ఉల్లంఘిస్తున్నారని విమర్శించారు. ప్రజలకు చెందిన రూ .140 కోట్ల రూపాయల డిపాజిట్లు ఉన్నాయని, ఆర్థిక భద్రతకు నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకులు వారి వంశపారంపర ఆస్తులా ఏమిటి ? దీనిపై ప్రజా పోరాటం చేస్తామన్నారు.

 

గామన్ బ్రిడ్జి ప్రమాదంకరంగా డ్రెడ్జింగ్ తో ఇసుక దోపిడీ...

 

బోట్ మెన్ సొసైటీల పేరుతో గామన్ బ్రిడ్జి వద్ద రాత్రి పగలు తేడా లేకుండా డ్రెడ్జింగ్ బోట్లతో ఈవీఎం ఎమ్మెల్యే అనుచరులు ఇసుక దోపిడీ చేస్తున్నారని భరత్ విమర్శించారు. గామన్ బ్రిడ్జి ప్రమాదంలో పడుతోందని, స్థానిక మత్స్యకారులు ఉపాధి కోల్పోతున్నారని, స్థానికులకు ఆరోగ్యపరంగా రోగాల బారిన పడుతున్నారని, ఈవీఎం ఎమ్మెల్యే ను ఎందుకు గెలిపించుకున్నామని క్షోభ పడుతున్నారని అన్నారు. ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు ఇసుక దోపిడీ జరుగుతోందని, సామాన్య ప్రజలకు ఇసుక లభ్యం కావడం లేదని విమర్శించారు ఈవీఎం ఎమ్మెల్యే ధనదాహం కు అంతం లేదని, గామన్ బ్రిడ్జి రక్షణ, పర్యావరణ పరిరక్షణ కోరుతూ ఆరోగ్యపరంగా ప్రజల పక్షాన ప్రతిపక్ష పార్టీ బాధ్యతగా ధర్నాలు చేస్తామని, అవసరమైతే నిరాహార దీక్షలు చేస్తామని భరత్ హెచ్చరించారు. ఇసుక దోపిడీ కి సంబంధించి సాక్ష్యాధారాలను జిల్లా కలెక్టర్ కు అందజేశామని చెప్పారు.

 

ముస్లిం ల షాదీ ఖానా నిర్మాణాన్ని అడ్డుకున్న ఈవీఎం ఎమ్మెల్యే ...

 

ఈవీఎం ఎమ్మెల్యే ముస్లింలకు వ్యతిరేకం అని, తన హయాంలో వీరభద్ర నగరం వద్ద పాత కబేళా స్థలంలో ముస్లింలకు 2500 చదరపు గజాలు( 50 సెంట్లు) షాదీ ఖానాకు కేటాయించానని రూ.50 లక్షల రూపాయల నిధులు కూడా కేటాయించినట్లు తెలిపారు. ఈ స్థలాన్ని ప్రస్తుతం ఈవీఎం ఎమ్మెల్యే ముస్లింలకు కేటాయించలేదని, పనులు కూడా పనులు కూడా ప్రారంభించలేదని, ప్రస్తుత ఎంపీ ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. షాదీఖానా నిర్మాణం జరిగేంత వరకు పోరాడుతానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వెంట వైయస్ఆర్ సీపీ నాయకులు, మహిళలు, కార్యకర్తలు ఉన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
కార్యకర్తలకు కేంద్రమంత్రి అండ.. సొంత డబ్బుతో ఇళ్ల నిర్మాణం.
    కార్యకర్తలకు కేంద్రమంత్రి అండ.. సొంత డబ్బుతో ఇళ్ల నిర్మాణం 12-06-2026 Fri ...
By Pagadala Venkateswar 2026-06-12 04:47:34 0 129
SURAKSHA
Architect of Growth: The Visionary Administrator Shaping DNH & DD
Driving Progressive Governance and Structural Transformation in the Union Territory True...
By Kalaga Sailaja 2026-08-01 13:09:44 0 242
Telangana
జాబ్ ఇస్తామంటూ యువకుడిని మోసం చేసిన సైబర్ గ్యాంగ్.|
మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా : అల్వాల్ పరిధిలో మరోసారి సైబర్ మోసగాళ్లు రెచ్చిపోయారు....
By Sidhu Maroju 2026-04-08 14:39:01 0 386
Andhra Pradesh
పుంగనూరు: చిన్నారి వైద్యానికి ఆర్థికంగా అండగా ఎంపీ
అన్నమయ్య జిల్లా, ముదివేడు గ్రామానికి చెందిన 10 ఏళ్ల ఆలియా అనే చిన్నారికి గుండెలో రంధ్రం ఉన్నట్లు...
By Kothuru Murali 2026-06-22 10:53:22 0 119
Telangana
నిజామాబాద్: రైల్వే డికోని వ్యక్తి ధూర్మమరణం
నిజామాబాద్ .జంకంపేట్ మధ్యగాల అర్సపల్లి రైల్వేగెట్ వాధ డెమో రైలు డికోని గుర్తుతేలియాని వ్యక్తి...
By Sadaq Sadaq 2026-04-12 16:22:55 0 154
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com