జర్మనీలో ప్రేమ.. పల్నాడులో పెళ్లి.. యాపిల్ ఉద్యోగి ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ.

0
109

పల్నాడు జిల్లా యువకుడిని పెళ్లాడిన జర్మనీ యువతి

జర్మనీలో చదువుకునే రోజుల్లో చిగురించిన ప్రేమ

నరసరావుపేటలో ఘనంగా జరిగిన వివాహ వేడుక

హిందూ, క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం పెళ్లి

ప్రేమకు భాష, ప్రాంతం, దేశం వంటి హద్దులు లేవని మరో జంట నిరూపించింది. పల్నాడు జిల్లాకు చెందిన యువకుడు, జర్మనీకి చెందిన యువతి ప్రేమ బంధంతో ఒక్కటయ్యారు. ఇరు కుటుంబాల అంగీకారంతో నరసరావుపేటలో నిన్న‌ వీరి వివాహం హిందూ, క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు వధువు కుటుంబ సభ్యులు, బంధువులు రష్యా, జర్మనీ నుంచి తరలివచ్చి సందడి చేశారు.

 

పల్నాడు జిల్లా నకరికల్లు మండలం దేచవరం గ్రామానికి చెందిన యాంపాటి శ్రీనివాసరావు, బంగారమ్మ దంపతుల కుమారుడు వెంకటేశ్వర్లు. ఉన్నత విద్య కోసం కొన్నేళ్ల క్రితం ఆయన జర్మనీ వెళ్లారు. రష్యాకు చెందిన పలీనా కుటుంబం కూడా జర్మనీలో స్థిరపడింది. వెంకటేశ్వర్లు, పలీనా ఒకే కాలేజీలో చదువుతున్న సమయంలో పరిచయం ఏర్పడి, అది కాస్తా ప్రేమగా మారింది.

 

చదువు పూర్తయిన తర్వాత వెంకటేశ్వర్లు యాపిల్ సంస్థలో ఉద్యోగంలో చేరగా, పలీనా కూడా ఉద్యోగం సంపాదించారు. తమ ప్రేమను గెలిపించుకోవాలని నిర్ణయించుకున్న ఈ జంట, తమ ఇళ్లలో పెద్దలను ఒప్పించారు. యువతి తల్లిదండ్రులు సెర్గెజోరిస్, ఎలీనా జోరినాలు ఈ వివాహానికి సంతోషంగా అంగీకరించారు.

 

దీంతో నరసరావుపేటలోని ఏ1 కన్వెన్షన్‌ హాల్‌లో వీరి పెళ్లి వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వివాహానికి హాజరైన విదేశీ అతిథుల కోసం ప్రత్యేకంగా తెలుగు వంటకాలను సిద్ధం చేయగా, వారు వాటి రుచికి ముగ్ధులయ్యారు. ఇటీవల కాలంలో తెలుగు యువత విదేశీయులను వివాహం చేసుకుని, తమ సొంత ప్రాంతంలో మన సంప్రదాయాల ప్రకారం వేడుకలు జరుపుకోవడం ఒక ట్రెండ్‌గా మారింది. ఇది రెండు విభిన్న సంస్కృతుల మధ్య బంధాన్ని బలపరుస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Search
Categories
Read More
Telangana
బీజేపీ సింగరేణి భరోసా కార్యక్రమన్ని అడ్డుకున్న పోలీసులు
మంచిర్యాల జిల్లా :  సింగరేణి లో జరుగుతున్న అవకతవకల పై సింగరేణి భరోసా కార్యక్రమంలో భాగంగా...
By Avunoori Mahesh 2026-06-19 11:56:35 0 247
Andhra Pradesh
మదనపల్లె: 'జలధార–జలహారతి' 100 రోజుల మిషన్ ప్రారంభం.
అన్నమయ్య జిల్లాలో నీటి కొరతకు శాశ్వత పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్...
By Pagadala Venkateswar 2026-04-07 04:00:08 0 197
Telangana
పెద్దపల్లి : ప్రైవేట్ విద్య సంస్థల ఫీజుల దోపిడి అరికట్టాలి... ఎస్ఎఫ్ఐ
పెద్దపల్లి జిల్లాలో ప్రవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు అధిక ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రులకు...
By Sunka Santhosh 2026-06-16 19:43:04 0 131
Andhra Pradesh
సింగపూర్ లో ఐదవ రోజు కొనసాగుతున్న మంత్రుల శిక్షణ
* *సింగపూర్‌లో 5 వ రోజు కొనసాగుతున్న మంత్రుల శిక్షణ కార్యక్రమం*   * *సింగపూర్ సంక్షోభ...
By Rajini Kumari 2026-04-25 11:46:45 0 202
BMA
The Glass Ceiling: The Gender Pay Gap in Indian Media
Despite a rapidly growing influx of talented female reporters on the ground, Indian media...
By JoinBMA 2026-08-21 04:49:21 0 191
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com