ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజనపై ఎర్రగడ్డ ఈఎస్ఐ ఆసుపత్రిలో అవగాహన సదస్సు

0
276

భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన పథకంపై ఈరోజు ఎర్రగడ్డలోని ఈఎస్ఐ ఆసుపత్రి ఆడిటోరియంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ముఖ్యఅతిథిగా మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు శ్రీ ఈటల రాజేందర్ గారు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో కూకట్‌పల్లి నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు శ్రీ వడ్డేపల్లి రాజేశ్వరరావు గారు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శ్రీ ఈటల రాజేందర్ గారు మాట్లాడుతూ…ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో దేశ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు, ఉద్యోగాల సృష్టిని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన ద్వారా యువతకు, ఉద్యోగార్థులకు మరియు సంస్థలకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు.

దేశ అభివృద్ధిలో యువత పాత్ర ఎంతో కీలకమని, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాల పెంపు ద్వారా వికసిత్ భారత్ లక్ష్య సాధనకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని వడ్డేపల్లి రాజేశ్వరరావు గారు తెలియజేశారు. 

ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ఉద్యోగులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
నిజామాబాద్: హనుమాన్ జయంతి శోభయత్రకు ఎయిర్‌పట్లు పుర్తి
నగరంలో గురువరం హముమాన్జజయంతి సంధర్బంగా నిర్వాహించనున్న శోభయత్రకు ఎయిర్‌పట్లు పుతిచేషారు....
By Sadaq Sadaq 2026-04-01 17:42:00 0 198
Telangana
2027 గద్దర్ అవార్డు లక్ష్యం గా నా "బతుకమ్మ " చిత్రం శ్రీను రావు పొన్నాల
తెలంగాణ ఆడ బిడ్డలు గర్వంగా  తలెత్తుకుని చూసే సినిమా ఈ సెప్టెంబర్‌లో వస్తుంది , తెలంగాణ...
By Ponnala Srinivasrao 2026-03-19 03:06:36 0 275
Ladakh
Ladakh Expands Sports Infrastructure and Winter Games
Ladakh is steadily strengthening its sports ecosystem by investing in modern infrastructure,...
By Fathima Safa 2026-07-01 10:07:42 0 115
Andhra Pradesh
చిన్నారులకు భోగి పండ్లు వైసీపీ నేతల ఆశీర్వాదాలు
చిన్నారులకు భోగి పండ్లు తో దీవించి వారిని ఆశీర్వదించిన వైకాపా నేత పోతిన వెంకట మహేష్ దంపతులు ...
By Rajini Kumari 2026-01-14 12:39:55 0 219
Andhra Pradesh
ఫ్యాక్టరీల పేరుతో రైతుల భూములను లాక్కోవద్దు: రిటైర్డ్ డీఎస్పీ.
పుంగనూరు మండలం గోపిశెట్టిపల్లె గ్రామస్థులతో కలిసి సోమవారం మదనపల్లె కలెక్టరేట్‌కు వచ్చిన...
By Pagadala Venkateswar 2026-05-26 06:14:33 0 128
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com