బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో నూనె, గ్యాస్ లేకుండా ఆరోగ్యకరమైన వంటల పోటీలు మహిళలను అభినందించిన రాష్ట్ర బీజేపీ సీనియర్ నాయకులు శ్రీ వడ్డేపల్లి రాజేశ్వరరావు

0
284

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మహిళా మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి విజయ భవాని గారి అధ్యక్షతన దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి 12 ఏళ్ల సుపరిపాలన (సుశాసన్), వికసిత్ భారత్ మరియు జన కళ్యాణ్ కార్యక్రమాలలో భాగంగా ఈరోజు 19వ తేదీన మేడ్చల్ జిల్లాలోని మోతీ నగర్ కమ్యూనిటీ హాల్‌లో వినూత్నమైన వంటల పోటీలు నిర్వహించారు.

ప్రస్తుత కాలంలో ఆరోగ్య పరిరక్షణ, సహజమైన ఆహారపు అలవాట్ల ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని నూనె మరియు గ్యాస్ వినియోగం లేకుండా ఆరోగ్యకరమైన వంటలు తయారు చేసే విధంగా ఈ పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 40 మంది మహిళలు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు *డా. శిల్పా రెడ్డి గారు, రాష్ట్ర బీజేపీ సీనియర్ నాయకులు శ్రీ వడ్డేపల్లి రాజేశ్వరరావు గారు* పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వడ్డేపల్లి రాజేశ్వరరావు గారు మాట్లాడుతూ మహిళల ప్రతిభ, సృజనాత్మకతను ప్రోత్సహించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. మహిళలు కుటుంబ ఆరోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నారని, ఆరోగ్యకరమైన వంట విధానాలపై అవగాహన పెంచడం అభినందనీయమని పేర్కొన్నారు.మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేందుకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని తెలిపారు. మహిళా సాధికారతకు దోహదపడే ఇలాంటి కార్యక్రమాలను మరింతగా ప్రోత్సహిస్తూ భవిష్యత్తులో కూడా నిర్వహించాలని సూచించారు.

అనంతరం పోటీలలో విజేతలకు గ్యాస్ వినియోగం లేకుండా వంట చేసుకునేందుకు ఉపయోగపడే ఎలక్ట్రిక్ కుక్కర్లు, రైస్ కుక్కర్లు, కెటిల్స్ తదితర బహుమతులను అందజేశారు.

ఈ కార్యక్రమంలో అసెంబ్లీ మాజీ కన్వీనర్ శ్రీకర్ రావు, మోతి నగర్ డివిజన్ అధ్యక్షులు ఎర్ర స్వామి, మోతి నగర్ డివిజన్ బిజెపి సీనియర్ నాయకులు శోభారాజన్, నాగరాజు, సద్గుణ రెడ్డి, అంజిరెడ్డి కూకట్ పల్లి నియోజకవర్గ మహిళా మోర్చా నాయకులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Search
Categories
Read More
Telangana
భాగ్యనగరంలో ఆఫ్రికన్ నత్తలు – భయాందోళనలో ప్రజలు.|
సికింద్రాబాద్ : భాగ్యనగరంలో నత్తలు  బెంబేలెత్తిస్తునాయి. ఆఫ్రికన్ నత్తల దాడికి ఎంతటి మహా...
By Sidhu Maroju 2025-11-06 08:06:55 0 300
Andhra Pradesh
విజయవాడ పూర్ణానంద పేట శిరిడి సాయిబాబా వార్షికోత్సవ సందర్భంగా హాజరైన వెల్లంపల్లి శ్రీనివాస్
విజయవాడ  15-04-2026   ప్రచురణార్ధం    పూర్ణానందంపేట శ్రీ షిర్డీ సాయిబాబా...
By Rajini Kumari 2026-04-15 13:07:24 0 172
Andhra Pradesh
నైరుతి రుతుపవనాల గురించి ఏపీకి వాతావరణ శాఖ కీలక అప్డేట్.
  నైరుతి రుతుపవనాల గురించి ఏపీకి వాతావరణ శాఖ కీలక అప్డేట్స్. AP Weather Update IMD Issues...
By Pagadala Venkateswar 2026-05-28 06:53:58 0 106
Andhra Pradesh
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ లాంఛనాలతో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
ప్రముఖ భారతీయ సంఘసంస్కర్త కులు వ్యతిరేక ఉద్యమకారుడు మహిళా విద్యాదాత అన్నగారిన వర్గాల సమానత్వం...
By Benguluri Madhubabu 2026-04-11 06:54:26 0 195
Telangana
పెట్రోల్‌ ఉచితంగా పంచుతోన్న హైదరాబాదీ.. ‘భాయ్, భారత్ మాతా కీ జై అనొద్దు ఇక్కడ’.. వీడియో వైరల్
దేశంలో ఇంధన నిల్వలు సరిపడా ఉన్నాయని కేంద్రంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పదే పదే చెబుతున్నాయి....
By Ponnala Srinivasrao 2026-03-28 02:03:36 0 243
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com