"మల్కాజిగిరి కమిషనరేట్‌కు కొత్త క్యాంప్ కార్యాలయం ప్రారంభం."|

0
205

"ప్రజలకు మరింత చేరువగా పోలీసు సేవలు అందించడమే లక్ష్యం: డీజీపీ సీ.వి. ఆనంద్."

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : ప్రజలకు పోలీసు సేవలను మరింత చేరువ చేయడం, పరిపాలనా సమర్థతను పెంపొందించడం లక్ష్యంగా మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్‌కు కొత్త క్యాంప్ కార్యాలయాన్ని తెలంగాణ డీజీపీ సీ.వి. ఆనంద్ ఐపీఎస్, బుధవారం  తెలంగాణ ప్రభుత్వ సలహాదారు సుధర్షన్ రెడ్డితో కలిసి ఆయన ఈ కార్యాలయాన్ని ప్రారంభించారు.

సికింద్రాబాద్ సిటీ సివిల్ కోర్టు సమీపంలోని మల్కాజిగిరి జోనల్ కార్యాలయ ఆవరణలో ఈ క్యాంప్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా డీజీపీ సీ.వి. ఆనంద్ మాట్లాడుతూ, కమిషనరేట్ సేవలను వికేంద్రీకరించడం ద్వారా ప్రజలకు మరింత సులభంగా పోలీసు సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ప్రధాన కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరాన్ని తగ్గించి, స్థానిక స్థాయిలోనే సేవలను అందించేలా ఈ క్యాంప్ కార్యాలయం పనిచేస్తుందన్నారు.

మల్కాజిగిరి, ఉప్పల్ జోన్ల పరిధిలోని పోలీసు స్టేషన్ల మధ్య సమన్వయాన్ని మెరుగుపరచడంలో ఈ కార్యాలయం కీలక పాత్ర పోషించనుంది. మొత్తం 11 పోలీసు స్టేషన్ల పరిపాలనా వ్యవహారాల పర్యవేక్షణ, కమాండ్ అండ్ కంట్రోల్ వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఇది ఉపయోగపడనుంది. 

ఫీల్డ్ స్థాయి అధికారులకు, ఉన్నతాధికారులకు మధ్య వారధిగా పనిచేస్తూ ప్రజల ఫిర్యాదులు, సమస్యల పరిష్కారంలో వేగం పెంచుతుందని అధికారులు తెలిపారు.

ప్రజా భద్రత, సేవల నిర్వహణలో సాంకేతికతను సమర్థంగా వినియోగించుకుంటూ మరింత సమర్థవంతమైన పోలీసింగ్ అందించేందుకు ఈ క్యాంప్ కార్యాలయం దోహదపడుతుందని డీజీపీ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి ఐపీఎస్, మల్కాజిగిరి మున్సిపల్ కమిషనర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి ఐఏఎస్, హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్ ఐపీఎస్, పోలీసు శాఖకు చెందిన ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

#Sidhumaroju

Search
Categories
Read More
West Bengal
West Bengal Accelerates Industrial Investment Growth
West Bengal continues to strengthen its position as a key investment destination in eastern India...
By Fathima Safa 2026-06-25 09:49:56 0 112
Andhra Pradesh
పుంగనూరు:చౌడేపల్లి మండలంలో అగ్నిప్రమాదం జరిగింది.
బుధవారం సాయంత్రం పుంగనూరు అగ్నిమాపక కేంద్ర పరిధిలోని చౌడేపల్లి మండలం, చుక్క వారి పల్లి గ్రామంలో...
By Kothuru Murali 2026-01-15 05:39:25 0 280
Andhra Pradesh
ఉద్యో గులు సమ్మె
  ఏపీ ఉద్యోగ ల సంఘం పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ మధ్యాహ్న భోజన విరామ...
By Mobbu Venkatramana 2026-02-12 15:43:29 0 305
Andhra Pradesh
విజయవాడ గొల్లపూడి వాసవి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్
గొల్లపూడి, వాసవి ఫార్మ మార్కెట్ కాంప్లెక్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం తృతియ...
By Rajini Kumari 2026-01-25 11:04:18 0 235
Telangana
బిజెపి ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మను దగ్ధం చేసిన క్యాతనపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ నాయకులు,
క్యాతనపల్లి మున్సిపాలిటీ అమ్మ గార్డెన్ స్టేజి దగ్గర గద్దెరాగడిలో పట్టణ అధ్యక్షులు పల్లె రాజు...
By Avunoori Mahesh 2026-04-18 07:51:07 0 311
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com