భూ సమస్యల పరిష్కారానికే రీ సర్వే

0
123

జిల్లా భూకొలతల సర్వే ల్యాండ్ సహాయ సంచాలకులు సి.హెచ్ శ్రీనివాసులు                                                                                                                                                                                                                  

మహబూబాబాద్, జూలై.03:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల రీ-సర్వే (భూ భారతి) ప్రక్రియపై జిల్లావ్యాప్తంగా  పలు మండలాల్లో అధికారులు ప్రజలకు మరియు రైతులకు అవగాహన సదస్సులు (గ్రామసభలు) నిర్వహిస్తున్నారని, ఎంతో కాలంగా నెలకొన్న భూ సమస్యలను పరిష్కరించేందుకే ప్రభుత్వం భూముల రీ సర్వే కార్యక్రమం చేపట్టిందని జిల్లా భూకొలతల సర్వే ల్యాండ్ సహాయ సంచాలకులు సి.హెచ్ శ్రీనివాసులు తెలిపారు. 

దీనిలో భాగంగా శుక్రవారం జిల్లా లోని వివిధ మండలాలలో  భూ భారతి - భూముల రీ సర్వేపై అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి అవగాహన సదస్సులు నిర్వహించారు. ప్రభుత్వం   జిల్లాలో 70 గ్రామాలు రీ సర్వే జరుపుటకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారని దానిలో భాగంగా రీ సర్వే పై అవగాహన కల్పించుటకు గ్రామ సభలు నిర్వహించుట జరుగుతుందని అన్నారు.

  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రీ సర్వే ద్వారా ప్రతి రైతుకు సర్వే నెంబర్ నమోదుచేసి (land parcel map), భూమి కమతాన్ని ఆన్లైన్లో పొందుపరుస్తామని, గతంలో జరిగిన సర్వేలో తప్పులు జరిగి ఉంటే రీ సర్వేలో సరిచేసుకోవచ్చని ఎలాంటి వివాదాలు లేకుండా చేసి భూమికి భూధార్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

సర్వేనిర్వహించే తేదీల్లో రైతులు అందుబాటులో ఉండి ఈ అవకా శాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞ ప్తి చేశారు. రీ సర్వే ద్వారా గ్రామ, భూ సరిహద్దులు, ప్రభుత్వ భూములు, చెరువులు, కాల్వలు, రహదారులతో పాటు ఇతర ప్రజా అవసరాల భూములను కచ్చితంగా రీ సర్వే చేయను న్నట్లు తెలిపారు. రీ సర్వే కార్యక్రమం ప్రజలకు మెరుగైన భూ హక్కులను కల్పించేందుకు ఉద్దేశించిందని  ప్రజల సహకారం తప్పనిసరి అని అధికారులు తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఉమ్మడి జిల్లాలోని కందుకూరు, మార్కాపురం సబ్ డివిజన్ పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ప్రకాశం జిల్లా ఎస్పి శ్రీ ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్, గారు
ఉమ్మడి జిల్లాలోని కందుకూరు, మార్కాపురం సబ్ డివిజన్ పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన...
By Chennaiah Kati 2026-02-04 07:06:45 0 395
BMA
The Developer Deficit: Building Games in Newsrooms
While the engagement potential of newsgames is massive, Indian media houses face a critical...
By JoinBMA 2026-08-21 18:54:47 0 339
Andhra Pradesh
అన్నమయ్య: అక్కపై కొడవలితో దాడి తమ్ముడు అరెస్ట్.
పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం దిగువపల్లి గ్రామపంచాయతీ బోయకొండ యానాదిపాలెంలో బుధవారం దారుణ...
By Pagadala Venkateswar 2026-02-11 11:24:39 0 186
Punjab
Punjab Boosts Sports Development and Youth Excellence
Punjab continues to strengthen its sporting ecosystem by investing in modern sports...
By Fathima Safa 2026-06-27 04:13:22 0 102
Andhra Pradesh
పుంగనూరు: దేవాదాయ శాఖలోకి మారెమ్మ ఆలయం కొత్తూరు మురళి
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలోని ప్రైవేటు బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీవిరుపాక్షి మారెమ్మ ఆలయం...
By Kothuru Murali 2026-03-13 08:57:48 0 186
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com